అంతర్జాతీయ మ్యాగజైన్.. కవర్ పేజీపై రామ్ చరణ్
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:09 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎస్వ్యైర్ ఇండియా' (Esquire India) తన ఏప్రిల్ కవర్ పేజీపై చరణ్‌ను ఫీచర్ చేసింది. హాంకాంగ్‌లోని అందమైన విక్టోరియా హార్బర్ నేపథ్యంలో జరిగిన ఈ ఫోటోషూట్‌లో చరణ్ లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. డార్క్ బ్లూ కోటు ధరించి, లాంగ్ హెయిర్‌తో, చేతిలో కుక్కపిల్లను పట్టుకుని ఉన్న ఆయన స్టైలిష్ అప్పియరెన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఈ మ్యాగజైన్ ఆయన్ను కొనియాడటం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రాయల్‌గా, క్లాసీగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాగజైన్లపై మెరవడం ఆయన క్రేజ్‌కు నిదర్శనం. హాంకాంగ్ వీధుల్లో ఆయన చేసిన ఈ ఫోటోషూట్ కేవలం స్టైలిష్‌గానే కాకుండా, ఒక ఇంటర్నేషనల్ ఐకాన్‌లా ఆయన ఇమేజ్‌ను ప్రతిబింబిస్తోంది.
మరోవైపు, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్, పాటలు విడుదలైన తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. రామ్ చరణ్ కెరీర్‌లో ఇది మరో వైవిధ్యమైన పాత్ర కాబోతోందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, దిగ్గజ నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చరణ్ స్టైలిష్ లుక్స్ తో పాటు ఈ సినిమా అప్‌డేట్స్ కూడా మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.