Ram Charan: వారి వల్లే నా చేతికి గాయం అయ్యింది..

ABN , Publish Date - May 18 , 2026 | 07:31 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). జూన్ 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Peddi Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). జూన్ 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం మే 18 న ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సెట్ లో చాలాసార్లు గాయాలపాలయ్యాడు. ఇప్పటికే చేతి మణికట్టుకు సర్జరీ అయ్యిన విషయం తెల్సిందే.


తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చరణ్ తన చేతికి అయిన గాయం గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ చేతికి గాయం డైరెక్టర్ బుచ్చి వలనే అయ్యిందని చెప్పకనే చెప్పుకొచ్చాడు. ' నేను బుచ్చికి ముందే చెప్పాను. ట్రైన్డ్ ఆర్టిస్టులను, ఫైటర్లను వాడమని చెప్పాను. కానీ, చాలా న్యాచురల్ గా రావాలని ఆయన రియల్ మల్లయోధులను తీసుకొచ్చాడు. వారితో కుస్తీ చేయడం వలన నా చేతికి గాయం అయ్యింది' అని తెలిపాడు.


రియల్ మల్లయోధులతో కుస్తీ అంటే మామూలు విషయం కాదు. పెద్ది కోసం చరణ్ మాత్రమే కాదు బుచ్చి కూడా చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. పెద్ది మీద ఇండస్ట్రీ మొత్తం చాలా ఆశలు పెట్టుకుంది. ట్రైలర్ మీద కూడా అంత నెగిటివిటీ రాలేదు. దీంతో పెద్ది ఖచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుందని అంటున్నారు. మరి పెద్ది ఎలాంటి హిట్ ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - May 18 , 2026 | 08:08 PM