Ram Charan - Upasana: రామ్ చరణ్ వారసుడొచ్చేస్తున్నాడు.. డేట్ ఫిక్స్
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:06 PM
మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ఓ చిన్న లోటు ఎప్పుటి నుండో ఉంది. తన ఇంట్లో అందరూ ఆడపిల్లే అని ఒక మనవడు పుడితే బాగుండునని ఆయన అనుకునేవారు
మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ఓ చిన్న లోటు ఎప్పుటి నుండో ఉంది. తన ఇంట్లో అందరూ ఆడపిల్లే అని ఒక మనవడు పుడితే బాగుండునని ఆయన అనుకునేవారు. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు తొలుత అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లీంకార అనే పేరు పెట్టారు. అయితే.. ఒక్క మనవడు పుడితే బాగుండునని చిరంజీవి దంపతులు అనుకుంటూ ఉన్నారు. ఆ కోరిక ఇప్పుడు తీరుతోంది. దీపావళి సమయంలో ఉపాసన సీమంతాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపినప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టబోతున్నారనే వార్త బయటకొచ్చింది.

ఇప్పుడు ఆ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఉపాసన ఈసారి జన్మనివ్వబోతోంది ఓ పాప, బాబుకి అని తెలిసింది. అంతే కాదు ప్రసవం తేదీ కూడా బయటకు వచ్చింది. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనివ్వబోతోందని చిరంజీవి సన్నిహితులు ద్వారా తెలిసింది. ఇది మెగా ఫ్యాన్స్‌కి చాలా పెద్ద గుడ్ న్యూస్ కానుంది. వారసుడి కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి కోరిక కూడా నెరవేరనుంది.