ఆ ఇద్దరు.. కొత్త సినిమాకు శ్రీకారం..

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:13 PM

'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి (Nageswararao Pujari) నిర్మాతగా సైన్మా స్టూడియోస్ బ్యానర్ పై తొలి చిత్రాన్నిప్రకటించారు.

'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి (Nageswararao Pujari) నిర్మాతగా సైన్మా స్టూడియోస్ బ్యానర్ పై తొలి చిత్రాన్నిప్రకటించారు. ఈ చిత్రానికి దర్శక నిర్మాత వేణు ఊడుగుల (Venu Udugula) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Movie.jfif

ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో అన్నా తమ్ముడు సైకిల్ పై వెళ్తుండటం చూపించారు. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన స్నేహితుడు మన సోదరుడు, కానీ ఆ బంధానికి మధ్యలో అహం అనే అడ్డుగోడలు మనమే నిర్మించుకున్నాం. అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 04:52 PM