‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి నెక్స్ట్ ఫిల్మ్ ఆ హీరోతోనేనా!

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:39 AM

తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ తోనే సంచలన విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లోని అందరి చూపు తనపై పడేలా చేసుకున్న దర్శకుడు సాయిలు కంపాటి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సాయిలు కంపాటికి టాలీవుడ్‌లో ఓ ప్రముఖ బ్యానర్ నుంచి అవకాశం వచ్చిన విషయం తెలిసిందే.

Raju Weds Rambai Director Saailu Kampati

తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju weds Rambai) తోనే సంచలన విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లోని అందరి చూపు తనపై పడేలా చేసుకున్న దర్శకుడు సాయిలు కంపాటి (Saailu Kampati). ఈ సినిమా సక్సెస్ తర్వాత సాయిలు కంపాటికి టాలీవుడ్‌లో ఓ ప్రముఖ బ్యానర్ నుంచి అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఏషియన్ సునీల్, పుస్కూరు రామ్మోహన రావు, భరత్ నారంగ్‌లకు చెందిన ఎస్వీసి ఎల్ఎల్‌పి బ్యానర్‌లో సాయిలు కంపాటి సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మళ్లీ తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమకథనే సాయిలు తెరకెక్కించబోతున్నాడనేలా వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోకు సంబంధించి వార్తలు మొదలయ్యాయి.


అవును, సాయిలు కంపాటి డైరెక్ట్ చేయబోయే తదుపరి హీరో ఎవరో కాదు.. సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) అని తెలుస్తోంది. ‘మేము ఫేమస్’, ‘గోదారి గట్టుపైన’ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుమంత్ ప్రభాస్‌‌తో సాయిలు కంపాటి తన నెక్స్ట్ పిక్చర్‌ని తెరకెక్కించబోతున్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌గా బాగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. అతి త్వరలోనే అనౌన్స్ చేయనున్నారనేలా టాక్ నడుస్తోంది. ఒక పెద్ద బ్యానర్‌లో రెండో సినిమా చేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఈ సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తే మాత్రం.. సాయిలు కంపాటి రేంజ్ కూడా పెరగడం ఖాయం.


ఇక సుమంత్ ప్రభాస్ విషయానికి వస్తే.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కథని మొదట సుమంత్ ప్రభాస్‌కే ఈ దర్శకుడు వినిపించాడట. కానీ, వరుసగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ చిత్రాలలో నటించడం ఇష్టంలేక సుమంత్ ప్రభాస్ ఈ ఆఫర్‌ని తిరస్కరించాడట. నిజంగా సుమంత్ ప్రభాస్ ఈ సినిమా చేసి ఉంటే, అతని రేంజ్ కూడా మరింత పెరిగి ఉండేది. సుమంత్ ప్రభాస్ కాదనడంతో అఖిల్ రాజ్ ఈ సినిమాకు ఫైనల్ అయ్యారు. కానీ, ఈసారి ఆ అవకాశాన్ని సుమంత్ ప్రభాస్ చేజార్చుకోకుండా.. చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏ విషయం త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి:

‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!

పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌.. ఇక పట్టుకోలేరేమో

Updated Date - Jun 29 , 2026 | 12:42 AM