Rajamouli: ఆయనతో నన్ను పోల్చకండి.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:56 PM

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Rajamouli

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన సినిమాలు, అందులోని విజువల్స్ చూసి అందరూ జక్కన్నను ఇండియన్ జేమ్స్ కామెరూన్ అని పిలుస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి.. వారణాసి (Vaaranaasi) చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెల్సిందే. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రాజమౌళి సినిమా అంటే ఒకపక్క షూటింగ్ జరుగుతూ ఉంటుంది.. ఇంకోపక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేస్తారు. వారణాసికి కూడా అదే చేశారు. వారణాసి టైటిల్ రివీల్ చేసిన వెంటనే హాలీవుడ్ మీడియాకు చిత్రబృందం కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఆ ఫుల్ ఇంటర్వ్యూలు రిలీజ్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూలలో రాజమౌళి, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా.. వారణాసికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి.. వారణాసి సినిమాను అవతార్ తో పోల్చడంపై స్పందించారు. విజువల్స్ పరంగా వారణాసి.. అవతార్ లా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. దానిపై జక్కన్న మాట్లాడుతూ.. ' జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ, ఆయనతో నన్ను పోల్చకండి. ఆయన ఒక శిఖరం లాంటివారు. ఒక మాస్టర్.. నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థినే' అని తెలిపారు. అంతేకాకుండా వారణాసి గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడుతున్నాం. వారణాసి నిడివి 3 గంటల 20 నిముషాలు ఉంటుంది. అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టాలి. 3 నిముషాలు బోర్ కొట్టించినా ప్రేక్షకుడు ఫోన్ పట్టుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా తెరకెక్కిస్తున్నాం. ప్రతి సీన్ కొత్త అనుభూతిని ఇస్తుంది' అని చెప్పారు.

Updated Date - Feb 04 , 2026 | 01:56 PM