Vaaranaasi: ప్రమోషన్లకే వంద కోట్లా..

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:44 PM

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తోన్న సినిమా వారణాసి (Vaaranaasi).

Vaaranaasi

Vaaranaasi: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తోన్న సినిమా వారణాసి (Vaaranaasi). మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఎప్పుడెప్పుడు వారణాసి రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ మధ్యనే రాజమౌళి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 7 న ఈ సినిమా రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. నిజం చెప్పాలంటే రాజమౌళి సినిమాలకు అసలు ప్రమోషన్ అవసరం లేదు. ఆయన పేరే ఒక బ్రాండ్. ఇంతకు ముందు సినిమాలకు ఖర్చు లేకుండా ప్రమోషన్స్ చేసిన జక్కన్న.. వారణాసికి మాత్రం చాలా గట్టిగా ఖర్చు పెడుతున్నారని టాక్ నడుస్తోంది. గట్టిగా అంటే ఎంత అనేగా.. రూ. 70 నుంచి 100 కోట్లు అని సమాచారం. ఏంటీ.. ప్రమోషన్లకే రూ. 100 కోట్లా అంటే నిజమే అన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

వారణాసి మొదలుపెట్టిన దగ్గర నుంచే రాజమౌళి ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. కేవలం టైటిల్ రివీల్ కే గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ చేసి హైప్ పెంచేశారు. ఆ తరువాత ప్రతి ఈవెంట్ కి అమెరికా నుంచి ప్రియాంకా చోప్రాను ఇండియాకు రప్పిస్తున్నారు. ఆ ఖర్చు కూడా ప్రమోషన్స్ లోనే కలుస్తోంది. ఇక రిలీజ్ డేట్ ని వారణాసిలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారు. వీటికే చాలా ఖర్చు అవుతోంది. ఇవి కాకుండా వారణాసి కోసం ప్రపంచం మొత్తం తిరగనున్నారట. దానికోసమే ఇంత బడ్జెట్ ని అనుకున్నారని టాక్. ఈ వార్త తెలియడంతో నెటిజన్స్.. మరీ వంద కోట్లు ఏంట్రా.. అది కూడా కేవలం ప్రమోషన్లకే.. జక్కన్న స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వారణాసి సినిమాతో జక్కన్న ఎన్ని కొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Updated Date - Feb 03 , 2026 | 05:44 PM