'రాజా ది రాజా'.. హీరోకు డబుల్ ఛాలెంజ్‌

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:32 PM

'రాజా ది రాజా' సినిమా హీరో రుత్విక్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని నిర్మాత నిహారికా దాసరి తెలిపారు.

Raja The Raja

‘‘రాజా ది రాజా’ చాలా బలమైన కథ. ఇందులో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఏ నటుడికైనా ఇది పెద్ద ఛాలెంజ్‌. రుత్విక్‌ ఆ రిస్క్‌ తీసుకుని ఈ సినిమా చేశాడు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసిన తర్వాత మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందనే సంతృప్తి కలిగింది’ అని అన్నారు నిర్మాత కె.నిహారికా దాసరి. రుత్విక్‌, విశాఖ ధిమాన్‌ జంటగా అనిల్‌ బోయిడపు తెరకెక్కించిన చిత్రం ‘రాజా ది రాజా’. ఈ చిత్రానికి నిహారికా దాసరి నిర్మాత. సినిమా ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా ఆమె మీడియాతో చిత్రం విశేషాలు పంచుకున్నారు.

నాలుగైదేళ్లు బాగా ఆలోచించి నిర్మాతగా మారాలనే నిర్ణయం తీసుకున్నా. రుత్విక్‌కు సినిమాలంటే చాలా ప్యాషన్‌. ఒక మంచి ఛాలెంజింగ్‌ పాత్రతో హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. అలా ‘రాజా ది రాజా’ కథ మా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా కోసం రుత్విక్‌ మెథడ్‌ యాక్టింగ్‌ చేశాడు. మొదట్లో నాకు అది అర్థం కాలేదు. కానీ ఒక సన్నివేశం పూర్తయ్యాక యూనిట్‌ అంతా చప్పట్లు కొట్టింది. దర్శకుడు అనిల్‌ చాలా క్రియేటివ్‌ పర్సన్‌. పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమాను తెరకెక్కించారు. ‘రాజా ది రాజా’ ఒక మంచి ఫీల్‌గుడ్‌ మూవీ. అన్ని వయసుల వారికి నచ్చుతుంది’ అని చెప్పారు.

Updated Date - Jul 14 , 2026 | 10:32 PM