రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇంట్రెస్టింగ్
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:59 PM
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో స్లీప్ వాకింగ్ చేస్తున్న ఓ యంగ్ హీరో వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్లలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో స్లీప్ వాకింగ్ చేస్తున్న ఓ యంగ్ హీరో వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్లలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ అసలు విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. ఆ వీడియోలో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) అని స్పష్టం చేస్తూ.. ఆయన నటిస్తున్న సరికొత్త చిత్రానికి ‘టార్టాయిస్’ (Tortoise) అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ (Tortoise First Look Poster) సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ సినిమాపై భారీ ఆసక్తిని పెంచుతోంది.
విడుదలైన ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశారు. నేలపై పడి ఉన్న ఓ డెడ్ బాడీ పక్కనే, రక్తపు మరకలతో కుర్చీలో కూర్చున్న రాజ్ తరుణ్ మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కాళ్ల దగ్గర పడి ఉన్న రక్తంతో కూడిన వేటకొడవలి, పక్కనే పాకుతున్న తాబేలు (టార్టాయిస్) దృశ్యాలు కథలోని క్రైమ్, మిస్టరీ ఎలిమెంట్స్‌ను స్పష్టం చేస్తున్నాయి. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రాజ్ తరుణ్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఇంతటి ఇంటెన్స్, డార్క్ అవతార్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మానస కుమార్, సంతోష్ ఇమ్మడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలబోసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు రిత్విక్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత చౌదరి (Amrutha Chowdary), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas), ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం, శబరి విగ్నేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బండ్ల గణేష్ ఎందుకు ఇంత హర్టయ్యాడు..
‘ఎపిక్’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
పవర్ స్టార్ బర్త్‌డేకి ‘ఓజీ-2’ అప్డేట్ ఉంటుందా..