సమంత: రాజ్‌ పక్కన ఉంటే ఎంతకాలమైనా పనిచేస్తూనే ఉంటా..

ABN , Publish Date - Feb 23 , 2026 | 09:45 PM

నాగచైతన్యతో విడాకులు, మయోసైటీస్‌ వ్యాధితో పోరాటం.. తర్వాత కోలుకుని మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టారు స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha).

Samantha

నాగచైతన్యతో విడాకులు, మయోసైటీస్‌ వ్యాధితో పోరాటం.. తర్వాత కోలుకుని మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టారు స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha). సినిమాలు, సిరీస్‌లతో బిజీ అయ్యారు. నిర్మాతగానూ కొత్త కెరీర్‌ మొదలుపెట్టారు. అంతే కాదు కొత్తగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది ఆమె దర్శకుడు రాజ్‌ నిడుమోరును వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) సినిమా చేస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘వివాహ బంధం నుంచి బయటకు వచ్చాక నాకు నేను చాలా దగ్గరయ్యాను. ఆ సమయంలో ఎదుటివారిని నమ్మడం, మరో వ్యక్తిపై ఆధారపడటం సాధ్యం కాదేమో అనిపించింది. ఎందుకంటే ప్రేమ, స్నేహం పూర్తిగా అంగీకరించే స్థితిలో, అంత బలంగా నేను లేను. కానీ రాజ్‌ నిడుమోరుతో (Raj nidumoru) పరిచయం నాలో మార్పు తీసుకొచ్చింది. సూర్యోదయాన్ని ఆస్వాదించటం, ధ్యానం చేయటం, నాతో నేను ఎక్కువసేపు గడపడం జరిగింది. రాజ్‌తో పరిచయం లేనప్పుడు ప్రతి రోజు నేను ఇలాగే ఉండేదాన్ని. ఇప్పుడు ఇద్దరం కలిసే అన్ని పనులు చేయాలనుకుంటాం. కలిసి పనిచేయడం, కలిసి ఆడటం, కలిసి వ్యాయామం చేయటం, కలిసే బయటకు వెళ్లడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం. నటనలోనూ నాలో మార్పు గమనించవచ్చు. మార్టిన్‌ స్కోర్సెస్‌, లియోనార్‌  డికాప్రియో ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. రాజ్‌ నిడిమోరు నా పక్కన ఉన్నంతకాలం నటిగా ముందుకు వెళ్తూనే ఉంటాను’ అని సమంత అన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:00 AM