అవి కాళ్లా.. స్ప్రింగులా! ఆ డ్యాన్స్.. ఏంటి రామచరణ్
ABN , Publish Date - Mar 03 , 2026 | 06:32 AM
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్బిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. సోమవారం ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రెండో గీతం ‘రై రై రా రా’ను విడుదల చేశారు.
రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్బిబాబు సానా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). సోమవారం ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రెండో గీతం ‘రై రై రా రా’ను విడుదల చేశారు మేకర్స్. ఈ మాస్ ఇంట్రో సాంగ్‌లో రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడంతో పాటూ స్వయంగా ఆలపించడం విశేషం. అనంత్ శ్రీరామ్ రచించారు.
అయితే.. ఈ పాట ఇంతకముందు వచ్చిన చికిరి స్థాయిలో లేకున్నా రామ్ చరణ్ స్టెప్పులు మాత్రం మరో రేంజ్‌లో ఉన్నాయని అవి కాళ్లా.. స్ప్రింగులా! ఆ డ్యాన్స్.. ఏంటి సినీ లవర్స్ ఆశ్చర్య పోతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే చరణ్ స్టెప్పలును చూసి సంబుర పడుతున్నారు. తెగ షేర్ చేస్తున్నారు. ఇది కధా మాకు కావాల్సింది అంటూ ఎగిరి గంతేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ స్టెప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో వృద్దీ సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్‌కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.