Rahul Sipligunj: బైక్‌పై కీరవాణితో.. రాహుల్‌ భావోద్వేగ పోస్ట్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:39 PM

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కీరవాణి గురించి పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తెలంగాణ జానపద శైలి, హైదరాబాద్‌ యాస, తన ప్రత్యేక గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipligunj) ‘మాగజాతి’, ‘గల్లీ కా గణేశ్‌’ వంటి ఆల్బమ్స్‌తో కెరీర్‌ మొదలుపెట్టి ‘జోష్‌’ సినిమాలోని ‘కాలేజ్‌ బుల్లోడా’ పాటతో సినీ గాయకుడిగా అడుగులువేశారు. ‘రంగస్థలం’ టైటిల్‌ సాంగ్‌తో అతని దశ తిరిగింది. 2019లో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 విజేతగా నిలిచి మరింత ప్రజాదరణ పొందాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం రాహుల్‌ కెరీర్‌కు మైల్‌స్టోన్‌గా నిలిచింది. కీరవాణి సంగీతంలో ఈ చిత్రంలో కాలభైరవతో కలిసి పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్‌ అవార్డు రావడం రాహుల్‌ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం విభిన్నమైన పాటలతో సింగర్‌గా కొనసాగుతున్నారు.

తాజాగా సోషల్‌ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్‌ బైక్‌ను కొనుగోలు చేశారు రాహుల్‌. దానిపై కీరవాణిని కూర్చోబెట్టి రైడ్‌కి వెళ్లారు. ఆ ఫొటోను షేర్‌ చేసి ‘నా సంగీత ప్రయాణానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. నా కలల బైక్‌ మీద కూర్చోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఇదొక ఫుల్‌ సర్కిల్‌ మూమెంట్‌’లాగా ఉంది అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 04:39 PM