సింగ‌ర్ చిన్మ‌యి భ‌ర్త‌ ద‌ర్శ‌క‌త్వంలో.. అడ‌వి శేష్

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:07 PM

అడివి శేష్‌ స్టోరీ సెలెక్షన్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన యాక్ట్‌ చేసే చిత్రాలకు కథల తయారీ అంత ఈజీగా ఉండదు. ఆయన్ను ఒప్పించడం చాలా కష్టమని సన్నిహితులు చెబుతుంటారు.

Adivi sesh

అడివి శేష్‌ (Adivi sesh) స్టోరీ సెలెక్షన్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన యాక్ట్‌ చేసే చిత్రాలకు కథల తయారీ అంత ఈజీగా ఉండదు. ఆయన్ను ఒప్పించడం చాలా కష్టమని సన్నిహితులు చెబుతుంటారు.

కథ నచ్చితే మాత్రం ఆ దర్శకుడు ఎవరు? ఏంటి? అతని ట్రాక్‌ రికార్డ్ ఏంటి అన్నది కూడా ఆలోచించకుండా సినిమా ఓకే చేస్తారని టాక్‌ ఉంది. తాజాగా ఆయన ఓ కథ విని అలాగే ఓకే చేశారట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran).

‘చి.ల.సౌ’ చిత్రంతో రాహుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. రెండో చిత్రం ‘మన్మథుడు 2’ ఫెయిల్‌ అయింది. తాజాగా రష్మికతో తీసిన ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ ఫర్వాలేదనిపించింది. కలెక్షన్లు పక్కనపెడితే విమర్శకుల ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి.



తాజాగా రాహుల్ రవీంద్రన్ రెండు కథలు సిద్ధం చేశారట. అందులో ఓ కథను దీక్షిత్‌శెట్టికి చెప్పారు.  రెండో కథను అడివి శేష్‌కి చెప్పగా ఆయనకు కథ నచ్చిందట. అయితే ప్రస్తుతం శేష్‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే!

ఆయన డేట్స్‌ కోసం కొంతకాలం వేచి చూడాల్సిందే! ఈ సమయంలో రాహుల్‌ రవీంద్రన్‌ -- దీక్షిత్‌ శెట్టి కాంబోలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తారని టాక్‌. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Updated Date - Mar 05 , 2026 | 03:38 PM