బండి భగీరథ్ పోక్సో కేసు.. హీరోలపై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 12 , 2026 | 04:30 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై పోక్సో కేసు నమోదైన విషయం తెల్సిందే. తనపై భగీరథ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.

Rahul Ramakrishna

కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై పోక్సో కేసు నమోదైన విషయం తెల్సిందే. తనపై భగీరథ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఈ కేసును విచారించడానికి పోలీసులు జాప్యం చేయడంతో రేవంత్ సర్కార్ సిట్ ని దించింది. ప్రస్తుతం బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.


ఇంత జరుగుతున్నా.. ఈ కేసుపై ఇండస్ట్రీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజకీయ నాయకుడు కొడుకు కాకుండా ఒక సామాన్య యువకుడు ఇలా చేసి ఉంటే.. అతనిని ఉరి తీయాలని, కఠిన శిక్ష వేయాలని ఇండస్ట్రీ మొత్తం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం టాలీవుడ్ మౌనంపై అసహనం వ్యక్తం చేశాడు. ఉట్టప్పుడు పులులు, సింహాలు, వేటగాళ్లు అనేవారు.. ఇప్పుడు మూగబోయారు అంటూ టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.


'ఆ గొంతు చించుకునే సినీ ప్రముఖులందరూ ఇప్పుడు నిశ్శబ్దమయ్యారు. చిత్ర పరిశ్రమలోని ఏ మూల నుంచీ త్వరగా న్యాయం చేయాలని, ఎన్‌కౌంటర్ పోలీసింగ్ జరగాలని, ప్రదర్శనాత్మక నైతిక ఆగ్రహం వ్యక్తమవ్వాలని, ట్వీట్ల వర్షం కురిపించాలని గట్టి పిలుపులు లేవు. ఉత్తప్పుడు అయితే అందరు పులులు, సింహాలు, వేటగాళ్ళు.. ఇగ ఇకపుడు ఎంతో మూగబోయినరు మరి' అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రాహుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ కమెడియన్ గా మారిన రాహుల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మరి రాహుల్ రామకృష్ణ చెప్పినట్లు ఆ పులులు, సింహాలు ఏమైనా స్పందిస్తాయేమో చూడాలి.

Updated Date - May 12 , 2026 | 04:44 PM