ప్యారడైజ్ నుంచి పావురం దిగింది..
ABN , Publish Date - Jun 19 , 2026 | 08:24 PM
నేచురల్ స్టార్ నాని (Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise).
నేచురల్ స్టార్ నాని (Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). దసరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ విలన్స్ గా నటిస్తున్నారు. కయాదు లోహార్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం నుంచి రాఘవ్ జుయల్ (Raghav Juyal) క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. కేవలం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌లో రాఘవ్ జుయల్ మోస్ట్ వయలెంట్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఖాన్దాన్ కీ శాన్.. దోస్తోం కీ జాన్.. విక్రమ్ మాలిక్ కా స్వాగత్ హై అంటూ వచ్చే డైలాగ్స్, రాఘవ్ జుయల్ సిగరెట్ కాలుస్తూ ఇచ్చే ఎంట్రీ ఎలివేషన్స్ సినిమాలో ఆయన విలనిజం ఏ రేంజ్‌లో ఉండబోతోందో స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ టేకింగ్ ఈ చిన్న వీడియోలోనే స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక చరిత్ర లో అందరూ చిలకలు పావురాలు గురించి రాసిండురే.. కాకి గురించి ఎవరూ రాయలేదు అని గ్లిమ్స్ లో చూపించారు. నాని.. కాకి, మోహన్ బాబు చిలుక.. రాఘవ్ పావురం అని శ్రీకాంత్ చెప్పేశాడు. ఇందులో మోహన్ బాబు శిఖంజా మాలిక్ గా కనిపించనున్నారు. ఆయన కొడుకుగా రాఘవ్ కనిపించనున్నాడు. ఇక విక్రమ్ మాలిక్ లుక్ తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ప్యారడైజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.