రాధిక: చిరు దోస.. ఆ టేస్ట్ ఎక్కడ దొరకదు..
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:28 PM
చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన దోశ వేసి ఇచ్చారని, అది మల్లెపువ్వులా ఉందని చెప్పారు రాధిక.
‘చిరంజీవి దోశ’ను గుర్తుచేసుకున్నారు నటి రాధికా శరత్‌కుమార్. పలు సందర్భాల్లో చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన దోశ వేసి ఇచ్చారని, అది మల్లెపువ్వులా ఉందని చెప్పారు. అలాంటి దోశ ఎక్కడ తినలేదని రాధిక అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi SarathKumar)స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సరస్వతి’ (Saraswathi Movie). ప్రియమణి, రావు రమేశ్, ప్రకాశ్‌రాజ్, నాజర్, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ నెల 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం, అతిథులతో యాంకర్ సుమ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక చిరు దోస గురించి చెప్పారు.