మూడు రోజుల్లో ‘రాకాస’ రాబట్టిన కలెక్షన్స్ ఎంతంటే?
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:35 AM
మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల, రెండో చిత్రంతోనూ అదే బాటలో నడుస్తున్నారు.
మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల, రెండో చిత్రంతోనూ అదే బాటలో నడుస్తున్నారు. ఒక వైపు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నప్పటికీ, ఆమె నిర్మించిన రెండో చిత్రం ‘రాకాస’ కలెక్షన్ల విషయంలో రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈమధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కు రావడం అరుదుగా జరుగుతోంది. అలాంటిది ‘రాకాస’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సైతం థియేటర్లకి రప్పిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా కలెక్షన్లపరంగా నిర్మాత నిహారికకు లాభాలను తెచ్చిపెట్టే ప్రాజెక్ట్‌గా మారుతోంది. తాజాగా ఈ మూవీ, మూడు రోజులకు రాబట్టిన కలెక్షన్స్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..
మూడు రోజుల్లో ‘రాకాస’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.15.80 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించినట్లుగా అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. మొదటిరోజు సినిమాకు అక్కడక్కడా మిశ్రమ స్పందన లభించినప్పటికీ, చిన్న పిల్లల్ని ఎంగేజ్ చేసే కంటెంట్ ఇందులో ఉండటం సినిమాకు ప్లస్ అయింది. అదే మౌత్ టాక్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే సినిమాకు 250K డాలర్ల వసూళ్లను సాధించటం అక్కడ సినిమాకు లభిస్తోన్నరెస్పాన్స్‌ను తెలియజేస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ సోషల్ మీడియాలో కూడా బలంగా కనిపిస్తుండటంతో, కలెక్షన్లపరంగా ఈ సినిమా దూసుకెళుతోంది. ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర ‘రాకాస’ బలంగా నిలబడుతుందని చిత్రయూనిట్ నమ్ముతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.