Pushpa 2 stampede: అల్లు అర్జున్ విచారణకు హాజరుకావాలి..
ABN , Publish Date - Jun 19 , 2026 | 06:25 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఏ11 నిందితుడిగా అల్లు అర్జున్‌ను చేర్చారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితులు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత కేసు విచారణ మొదలు కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులు చేర్చి పోలీసులు ఛార్జీ షీటు దాఖలు చేశారు.
పుష్ప-2 విడుదల సందర్భంగా 2024 డిసెంబర్ 4న ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలో థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి కొన్ని నెలలపాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు . ఈ మధ్యనే డిశ్చార్జ్ చేశారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులకు అల్లు కుటుంబం పెద్ద మొత్తంలో సాయం అందించిన విషయం తెలిసిందే!