పోస్ట్ ప్రొడక్షన్‌లో.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్!

ABN , Publish Date - Apr 21 , 2026 | 09:20 PM

సరస్వతి బత్తుల సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం పురుష: .

సరస్వతి బత్తుల సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం పురుష: (Purushaha). కామెడీ, ఎమోషన్ కలబోసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం’ రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan) ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండ‌గా వీరు వులవల (Veeru Vulavala) దర్శకత్వం వహిస్తున్నాడు. సప్తగిరి (Saptagiri), కసిరెడ్డి రాజ్‌కుమార్ (Rajkumar), రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను సృష్టించాయి. ముఖ్యంగా కామెడీ టచ్‌తో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, పాట‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ ఎంటర్టైనర్ ట్రేడ్ వర్గాల్లోనూ పాజిటివ్ టాక్‌ను సంపాదించింది. పాటలు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ట్రెండింగ్‌లో నిలిచాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ మే నెలలో విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్‌ను కోటి నిర్వహిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 06:18 AM