పవన్ కళ్యాణ్ అభిమాని నిర్మించిన చిత్రం.. విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - May 10 , 2026 | 11:19 PM

పవన్ కళ్యాణ్ అభిమాని బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ‘పురుష:’ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. సప్తగిరి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మే 22న విడుదల కానుంది.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘పురుష:’. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మే 22న రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర వివరాలను తెలిపేందుకు మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘పురుష:’ కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్నే కారణం. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన వీరు అన్నకి థ్యాంక్స్. నాకు యాక్టింగ్‌లో సపోర్ట్ చేసిన సప్తగిరి అన్నకి, కసిరెడ్డి అన్నకి థ్యాంక్స్. సక్సెస్ ఫుల్‌గా ఈ మూవీని పూర్తి చేశాం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సమ్మర్‌లో ‘పురుష:’ మే 22న విడుదల కాబోతోంది. నిర్మాతగా మా నాన్న అనుకున్న స్థాయిలోనే సినిమాని తీశామని, నేను నటించానని అనుకుంటున్నాను. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ.. ‘‘పురుష:’ విషయంలో నాకు సపోర్ట్ చేసిన నిర్మాత కోటేశ్వరరావు, కెమెరామెన్ సతీష్, హీరో పవన్ కళ్యాణ్‌లకు థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన సప్తగిరి, కసిరెడ్డి, మా హీరోయిన్లకు థ్యాంక్స్. మే 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

సప్తగిరి మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన బత్తుల కోటేశ్వరరావు.. తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ ఈ ‘పురుష:’ సినిమాను నిర్మించారు. మా డైరెక్టర్ వీరూ మా నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సినిమా ఎలా ఉంది.. స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనేది తెలియాలంటే మే 22 వరకు వేయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు. మా ముగ్గురు హీరోయిన్‌లు, కసిరెడ్డి తమ్ముడు అందరూ బాగా నటించారు. మా దర్శకుడు వీరూ పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక పది సంవత్సరాలు వినపడేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రాజ్ కుమార్, హాసిని సుధీర్, రాయంచ, విషిక తదితరులు మాట్లాడుతూ.. సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరారు.

Updated Date - May 10 , 2026 | 11:19 PM