Puri Jagannadh: దేవుళ్ళే పెళ్ళాలను ఏడిపించారు.. మేమే ఇంకా బెటర్

ABN , Publish Date - May 23 , 2026 | 08:25 PM

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ఎప్పుడూ గుర్తుపెట్టుకొనే హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో ఆయన ఒకరు.

Puri Jagannadh

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ఎప్పుడూ గుర్తుపెట్టుకొనే హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం స్లమ్ డాగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు పూరి. కేవలం సినిమాలతోనే కాదు, తన మనసులోని భావాలను పంచుకునే పూరి మ్యూజింగ్స్ (Puri Musings) ఆడియో పాడ్‌కాస్ట్‌లతో కూడా ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. సమాజం, జీవితం, సంబంధాలపై ఆయన చెప్పే బోల్డ్ మరియు ప్రాక్టికల్ మాటలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.


ఇక తాజాగా పూరి.. పెళ్ళి, భార్యల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఈ ఆడియో ఇప్పటిది కాదు.. దాదాపు 5 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ ఆడియో సడెన్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూరి.. ఆడవారిని, దేవుళ్ళను అవమానించాడని కొందరు ఫైర్ అవుతున్నారు. అసలు ఆ ఆడియోలో పూరి ఏం చెప్పాడు అంటే.. ' పెళ్ళైన ఆడవారందరికి ఓ విన్నపం.. జీవితంలో ఫర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు.. ఫర్ఫెక్ట్ డ్రైవర్.. ఫర్ఫెక్ట్ నర్స్ ఉండొచ్చు.. కానీ, ఫర్ఫెక్ట్ హస్బెండ్ మాత్రం ఉండడు. ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి.. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి.. ఇలాగే.. ఇలాగే అని ఎంత పెద్ద లిస్ట్ రాసుకున్నా అన్ని సమస్యల్లో పడిపోతారు. భర్తను కస్టమైజ్ చేయలేము.అందుకే ప్రతి ఆడది పెళ్ళైన తరువాత కన్నీళ్ళు పెట్టాల్సిందే. తప్పదు. ఎక్కువగా భర్తనే ఏడిపిస్తాడు. జీవితాంతం ఉంటాడు కదా.


భర్త చేసే తప్పులే తండ్రి, తమ్ముడు చేస్తే సర్దుకుపోతుంటారు. మీరు మీ నాన్నను క్షమించలేదా.. అలాగే భర్తలను క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీళ్లు చూడటం పక్కింటి వదినలకు చాలా ఇష్టం ఉంటుంది. అందుకే వారు చెప్పే చాడీలు, సలహాలు విని నమ్ముకున్న భర్తతో గొడవలు పెట్టుకుని జీవితాన్ని పాడుచేసుకోవద్దు. ఆవిడ భర్త ఏమి శ్రీరామ చంద్రుడు కాదు.. అందరి భార్యల కన్నా ఎక్కువ ఏడ్చింది రాముని భార్యనే. భర్త ఎంత గొప్పవాడు అయితే భార్యకు అన్ని కన్నీళ్ళు వస్తాయి. ప్రతి దేవుడు.. వాళ్ళ భార్యను ఏడిపించినవారే. భార్యను ఏడిపించని ఒక్క దేవుడి పేరు చెప్పండి. భార్యలకు ఏడవం వచ్చు అని తెలిస్తే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు.


ఇక తప్పు చేసిన భర్తని.. మీ అన్నో, తమ్ముడో అని అనుకోని వదిలేయండి. జీవితంలో మీ భర్త లేకున్నా ఆ ఏడుపు ఉంటూనే ఉంటుంది. మమ్మల్ని కాదని దేవుళ్ళను పెళ్ళి చేసుకుంటే ఇంకో పెద్ద పెంట. ఆయన రోజు ఖాళీగా ఉండడు. భక్తులు అంటాడు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతూ ఉంటాడు. ఎవరో చనిపోతే అక్కడకు వెళ్తాడు. మీకు బీపీ వస్తుంది. నాకు ఎందుకురా ఖర్మ అనిపిస్తుంది. అందుకనే మాతోనే సరిపెట్టుకోండి. మేము మగాళ్ళం.. మా అమ్మలు అనుకొనేంత మంచివాళ్ళం కాదు.. మా భార్యలు అనుకునేంత దుర్మార్గులం కాదు. దయచేసి అర్ధం చేసుకోండి. ఇక్కడ ఫర్ఫెక్ట్ హస్బెండ్ కానీ, ఫర్ఫెక్ట్ వైఫ్ ఉండరు. పెళ్ళి అంటేనే అడ్జెస్ట్ మెంట్ ఆఫ్ ఇండియా' అని చెప్పుకొచ్చాడు.


ఇక పూరి దేవుళ్ళను అవమానించాడని, అసలు వారి గురించి మాట్లాడే అర్హత ఈయనకు ఎక్కడుందని.. పూరి ఏమైనా తప్పులు చేయకుండా ఉన్నాడా.. ? భార్యను వదిలి ఛార్మీతో ఉండడం లేదా.. అని ఫైర్ అవుతున్నారు. కొంతమంది మాత్రం 5 ఏళ్ళ క్రితం వచ్చిన ఆడియోపై ఇప్పుడు ఫైర్ అవ్వడం ఏంటని మాట్లాడుతున్నారు. మరి ఈ ఆడియోపై పూరి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Updated Date - May 23 , 2026 | 08:52 PM