SKN: ప్రభాస్ ఫ్యాన్స్ అరాచకం.. పోలీసులను ఆశ్రయించిన నిర్మాత
ABN , Publish Date - Jan 23 , 2026 | 09:23 PM
బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ నిర్మాతగా మారాడు SKN. ఈ సినిమా తరువాత ఆయన లైఫ్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలకు నిర్మాతగా, సహా నిర్మాతగా పనిచేస్తూ బిజీగా మారాడు. తాజాగా SKN సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
SKN: బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ నిర్మాతగా మారాడు SKN. ఈ సినిమా తరువాత ఆయన లైఫ్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలకు నిర్మాతగా, సహా నిర్మాతగా పనిచేస్తూ బిజీగా మారాడు. తాజాగా SKN సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ది రాజాసాబ్ (The Raja Saab)సినిమా రిలీజ్ సమయంలో సినిమాపై అంచనాలు పెంచేలా డైరెక్టర్ మారుతీ (Maruthi), SKN మాట్లాడారు. కానీ, సినిమా వారు చెప్పిన విధంగా లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వారిద్దరిపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మారుతీని, SKNని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూనే వస్తున్నారు. ఈ ట్రోలింగ్ ఈ మధ్య హద్దు దాటింది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అరాచకంగా మారారు. SKN పేరును వాడుతూ మిగతా హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు. దీంతో SKN సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై, తన చిత్రబృందంపై కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, తన పేరుతో హీరోలని, నటుల్ని, సినిమాలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా SKN కోరాడు. ఇలాంటివి చాలా వివాదాలకు దారితీస్తాయని, నెగిటివిటీని పెంచుతాయని ఆయన ఫిర్యాదులో తెలిపాడు. ఇలా చేసినవారిని ఊరికే వదిలేయకూడదని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక SKN ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
ఇంకోపక్క డైరెక్టర్ మారుతీ ఇంటికి సైతం అనేక లెటర్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమా రిలీజ్ సమయంలో.. రాజాసాబ్ కనుక మీకు నచ్చినట్లు లేకపోతే మా ఇంటికి వచ్చి అడగండి అంటూ అడ్రెస్స్ చెప్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆ ఇంటికి ట్రోల్స్ చేస్తూ లెటర్స్ పంపుతున్నారట. మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.