PVP: సినిమా రంగం.. మన డబ్బు ఇచ్చి మన మీద పెంట వేసుకున్నట్టే
ABN , Publish Date - May 13 , 2026 | 06:41 PM
నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి (PVR) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో వివాదం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండేవాడు.
నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి (PVR) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో వివాదం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండేవాడు. బలుపు సినిమాతో నిర్మాతగా కెరీర్ ని మొదలుపెట్టిన పీవీఆర్ ఆ తరువాత క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి సినిమాలను నిర్మించాడు. అయితే సడెన్ గా పీవీఆర్ ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యాడు. ఇండస్ట్రీని ఆయన ఎందుకు వదిలేశాడు అన్న విషయం ఎవరికీ తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పీవీఆర్ ఇండస్ట్రీ వదిలి వెళ్ళడానికి కారణం చెప్పాడు.
' సినిమాను నిర్మించడమంత దారుణమైన బిజినెస్ ఇంకొకటి లేదు. మనం డబ్బు ఇచ్చి అవమానాలు పడేది కేవలం ఈ బిజినెస్ లోనే ఉంది. మనం డబ్బిచ్చి మనం పెంట వేసుకోవడం అనేది పిచ్చితనం. అందుకే నేను ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేశాను. ఇప్పుడు నిర్మాత అనేవాడు ఒక జోకర్ అయ్యిపోయాడు. సెట్ లో అందరూ నిర్మాతల మీద జోకులు వేసుకుంటున్నారు. డబ్బు పెట్టేది నిర్మాత.. సినిమా సంకనాకిపోతే రోడ్డెక్కేది నిర్మాతనే. అలాంటప్పుడు నిర్మాత అంటే ఎలా ఉండాలి. వెస్ట్రన్ స్టూడియోస్ విధానం ఇక్కడ లేదు. ఇక్కడ హీరోలే సినిమాలను నడిపిస్తున్నారు.
ఇక బండ్ల గణేష్ తో ఉన్న వివాదం గురించి కూడా పీవీఆర్ మాట్లాడాడు. టెంపర్ సినిమాకు మొత్తం డబ్బు తానే ఇచ్చానని, అప్పు ఇవ్వడమంటే తాను బ్యాంక్ లాగా.. అలాంటప్పుడు తనకు అప్పు అడిగే హక్కు ఉందని తెలిపాడు. బ్యాంక్ తరహాలో వడ్డీ అడిగినప్పుడు వివాదాలు తలెత్తాయని, తనకు రావాల్సినడబ్బును అడిగి తీసుకోవడానికే ఎన్నో అవమానాలు పడ్డట్లు ఆయన తెలిపాడు.