'పోలీస్ వారి హెచ్చరిక' నిర్మాత ఇకలేరు
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:07 PM
'పోలీస్ వారి హెచ్చరిక' సినిమాతో నిర్మాతగా మారి సినీరంగ ప్రవేశం చేసిన బెల్లి జనార్ధన్ ఇకలేరు.
'పోలీస్ వారి హెచ్చరిక' సినిమాతో నిర్మాతగా మారి సినీరంగ ప్రవేశం చేసిన బెల్లి జనార్ధన్ (Belli Janardhan) ఇకలేరు. ఉగాది పండుగ సందర్భంగా అత్తగారి ఊరైన కట్టంగూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన ఆయన అక్కడ మరణించారు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి అడుగుకు బలంగా తల తగిలి అక్కడికక్కడే ఊపిరి వదిలారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 23న స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో మాజీ సైనికుడైన జనార్ధన్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. బెల్లి జనార్ధన్ ఆకస్మిక మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ 'పోలీస్ వారి హెచ్చరిక' చిత్ర బృందం తరపున దర్శకుడు బాబ్జి నివాళి అర్పించారు.