ప్రియాంకా మోహన్‌ : ‘మేడ్‌ ఇన్‌ కొరియా’ వచ్చేది ఎప్పుడంటే...

ABN , Publish Date - Feb 26 , 2026 | 10:25 AM

హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ ప్రధాన పాత్రలో ‘మేడ్‌ ఇన్‌ కొరియా’  సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 12న విడుదల చేయనున్నారు.

హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ ప్రధాన పాత్రలో ‘మేడ్‌ ఇన్‌ కొరియా’  సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 12న విడుదల చేయనున్నారు. రా. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పనులు కొంతకాలం మందకొడిగా సాగాయి. ఇప్పడు  పోస్ట్‌ ప్రొడక్షన్‌  పనులన్నీ పూర్తి చేసుకుని నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో  విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా వివరాలను దర్శకుడు కార్తీక్‌ వివరిస్తూ ‘కుగ్రామంలో జన్మించిన యువతి ఏదో ఒక రోజున దక్షిణ కొరియాకు వెళ్లాలన్న కలల్లో జీవిస్తుంది. ఆ కలను నిజం చేసే ప్రయాణమే ఈ చిత్రకథ. రైజ్‌ ఈస్ట్‌ పతాకంపై ఇది తెరకెక్కింది. షెన్ బా అనే యువతి ఈ కథ చెబుతుంది.

ALSO READ: త్రిష: జోరుమీదున్న చెన్నై చంద్రం


కొరియా సంస్కృతి సంప్రదాయాలపై చిన్న వయసు నుంచే ఎంతో మక్కువ కలిగిన ఆ యువతి నిజ జీవితంలో ఆ అనుభవాన్ని పొందిందా? ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? తదితర అంశాలతో ఒక ఎమోషనల్‌ జర్నీనే ‘మేడ్‌ ఇన్‌ కొరియా’. పైగా కొరియన్‌, తమిళ సంస్కృతుల మధ్య లోతైన చారిత్రక సారూప్యతలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. అవి నా హృదయానికి మరింత దగ్గర కావడంతో ఈ స్ఫూర్తిదాయకమైన కథ చెప్పడానికి నన్ను ప్రేరేపించాయి. ఇందులో సౌత్‌ కొరియా నటుడు పార్క్‌ హైజిన్‌ ఓ ప్రధాన పాత్రను పోషించారు’ అని  అన్నారు. 

ALSO READ: విరోష్‌ వెడ్డింగ్ : విరోష్‌ సంగీత్‌.. హైలైట్స్‌ ఇవే..


Updated Date - Feb 26 , 2026 | 10:37 AM