Idupu Kayitham: ప్రతి ఇంట్లో ఉండే కథ.. ‘ఇడుపు కాయితం’

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:33 PM

ప్రియదర్శి కథానాయకుడిగా నూతన చిత్రం ‘ఇడుపు కాయితం’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. బన్నీ వాస్‌ వర్క్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ పై దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు.

Mirzapur The Movie


ప్రియదర్శి (Priyadarshi) కథానాయకుడిగా నూతన చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu kayitham)చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. బన్నీ వాస్‌ వర్క్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ పై దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం లోకేష్‌ కనకరాజ్‌ ఫస్ట్‌ లుక్‌ను ఆవిష్కరించారు.  అల్లు అరవింద్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ
‘ఇడుపు కాయితం’ కథ చెప్పగానే నమ్మి సినిమా చేస్తున్నామని గట్టిగా చెప్పిన మా ఆడబిడ్డ తబిత గారికి థ్యాంక్స్‌. నమ్మితేనే ఎవరైనా పైకి వస్తారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ ఇది’ అని అన్నారు.

నిర్మాత తబిత సుకుమార్‌ మాట్లాడుతూ '
దర్శకుడు కథ చెబుతున్నప్పుడు మేము చిన్నప్పుడు విన్న విషయాలు, పెద్ద వాళ్లు ఎలా హ్యాండిల్‌ చేేసవాళ్లు.. ఇవన్నీ గుర్తొచ్చాయి. ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయాను. మనం ఎలాగైనా సుకుమార్‌ రైటింగ్స్‌లో ఈ సినిమా చేయాలని, మనం చేస్తున్నాం అంతే అని సుక్కుకు చెప్పాను. వంశీ ఈ క్యారెక్టర్స్‌, ఎమోషన్స్‌ చాలా బాగా రాసుకున్నారు. వంశీ గారు కథ చెబుతున్నప్పుడే విజువల్‌గా చూడగలిగాను. ఈరోజు పోస్టర్‌ చూశాక కూడా హ్యాపీ ఫీలింగ్‌ కలిగింది. సినిమా బయటకొచ్చాక ఇలా ఉంటుందేమో, ఆడియెన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు అనిపించింది. సుకుమార్‌ రైటింగ్స్‌లో ఇదొక మైల్‌ స్టోన్‌ లాంటి సినిమా అవుతుంది’ అన్నారు.

బన్నీ వాస్‌ మాట్లాడుతూ
‘మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. సబ్‌ టైటిల్స్‌తో బిహార్‌లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూేస చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్‌ ప్రాబ్లమ్‌ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్‌ కు వెళ్లండి, అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్‌కు వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులుని పట్టుకుంటుంది. అల్లుడు చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు ఈ కథను చెప్పగలను. ‘ఇడుపు కాయితం’తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం. నేను సుకుమార్‌ కలిసి సినిమా నిర్మిస్తుంటే ఎవరైనా హ్యాపీగా వచ్చి చేసేస్తారనుకున్నా. కానీ నాగదుర్గ మాకు 15 కండీషన్స్‌ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుంది అనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఆ డ్యాన్స్‌ నెంబర్‌కు స్ర్కీన్స్‌ చిరిగిపోతాయి. ఈ సినిమా కథను మా దగ్గరకు తీసుకొచ్చి మేమంతా కలిసి ఈ మూవీ చేేసలా చేసింది ప్రియదర్శి. మా టీమ్‌ అంతా కలిసి ఒక మంచి మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నాం’ అన్నారు.

హీరోయిన్‌ నాగదుర్గ మాట్లాడుతూ ‘ఇడుపు కాయితం’ సినిమాతో హీరోయిన్‌గా వస్తున్నాను. నేను ఈ స్టోరీని నమ్మాను. నన్ను ఈ స్టోరీ నమ్మింది.  ఈ కథలో చేస్తున్న శ్రీలత పాత్ర చాలా బరువైంది.  చేయగలనా, లేదా అని భయపడ్డాను.   వంశీ  చేయగలననే నమ్మకాన్ని ఇచ్చారు. ఈ సినిమాను థియేటర్స్‌ లో చూస్తూ రచ్చ రచ్చ చేస్తారని చెప్పగలను’ అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ
'ఈ సినిమా నేను గర్వపడేలా చేస్తుంది. ఇందులో శ్రీనివాస్‌ పాత్రలో కనిపించబోతున్నా. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు కానీ ఇది గ్లోబల్‌ స్థాయి సినిమా అవుతుంది. ఈ సినిమాను మేము జమ్మికుంట, హైదరాబాద్‌, సనత్‌ నగర్‌ ఎక్కడ చిత్రీకరించినా, ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి’ అని అన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 05:10 PM