PremaNe Oorilo: రూపాయి పెడితే ఐదు రూపాయలు తెచ్చే సినిమా

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:50 AM

శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ తదితరులు కీలక పాత్రల్లో నటించిన  ప్రేమనే ఊరిలో’ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు.

శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు.

ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ‘‘ప్రేమనే ఊరిలో’ టైటిల్, పాటలు బాగున్నాయి. ఈ సినిమాతో శ్రీనివాస్ కు  మంచి విజయం దక్కాలి. నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చందు శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ప్రేమనే ఊరిలో’ సినిమాతో నిర్మాతగా అడుగు పెడుతున్నాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. పోస్టర్ చూసిన వెంటనే నాకు ఎంతో నచ్చింది. టీజర్ చూసి సురేష్ గారికి ఫోన్ చేశాను. శ్రుతి, దేవేందర్, నేను కలిసి ఈ టీజర్‌ను సురేష్‌కి చూపించాం. జెన్ జీ ఆడియెన్స్‌ని కూడా మూవీని చూపించాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌కి సినిమా చాలా నచ్చింది. శ్రీరామ్, రమిక, తపస్విని అద్భుతంగా నటించారు' అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘
నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ రేంజ్‌లో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉండమని చందుకి సలహా ఇస్తుంటాను. అయితే ఈ మూవీ గురించి చెప్పినప్పుడు, చూసినప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. మనం  కలిసి ఇకపై జర్నీ స్టార్ట్ చేద్దాం అని చందుతో అన్నాను. ‘ప్రేమనే ఊరిలో’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. శ్రీరామ్, రమిక, తపస్వినిలకు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. కన్నడ, తెలుగులో ఈ సినిమాకి మంచి విజయం దక్కుతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభం తీసుకు వచ్చే సినిమా అవుతుంది' అని అన్నారు. 

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ  ‘
‘ప్రేమనే ఊరిలో’ చిత్రం కోసం హైదరాబాద్‌కి రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను చూపిస్తారు. నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ‘ప్రేమనే ఊరిలో’ సోల్ ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది' అని అన్నారు.

 

Updated Date - Sep 19 , 2026 | 01:23 PM