సెన్సార్‌నే భయపెట్టిన సినిమా .. #418 ట్రైలర్ రిలీజ్
ABN , Publish Date - Sep 11 , 2026 | 07:20 PM
కెజిఎఫ్, సలార్ వంటి పవర్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కీర్తన్ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ #418 - ది లాస్ట్ వార్నింగ్.
కెజిఎఫ్, సలార్ వంటి పవర్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కీర్తన్ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ #418 - ది లాస్ట్ వార్నింగ్ (#418). చైత్ర జె ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ వీరబత్తిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఇప్పటిక్ ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను సెన్సార్ వాళ్లే రిలీజ్ చేయకూడదని ఆపడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఎంతో భయంకరంగా ఉండడంతో సెన్సార్ వాళ్లే భయపడ్డారని, అందుకే ఈ సినిమాను ఆపమని చెప్పినట్లు సమాచారం.
ఇక ఎట్టకేలకు ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ప్రకృతి వైపరీత్యం రాకముందే పక్షులు, జంతువులు దానిని ముందుగానే పసిగడతాయనే ఆసక్తికరమైన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఒక బిల్డింగ్‌లోని రూమ్ నంబర్ 418ని చాలా కాలం తర్వాత మళ్లీ ఓపెన్ చేయడం వల్ల జరిగే భయానక పరిణామాలు మొదలలైనట్లు చూపించారు. ఆ రూమ్ లో దేవిక అనే గర్బిణి ఉందని, ఆమెకు ఏదో జరగడం వలన దెయ్యంలా మారిందని ట్రైలర్ లో చూపించారు. అసలు ఆ దేవిక ఎవరు.. ? ఆ రూమ్ లో ఏం జరుగుతుంది. అందులోకి ఏ అమ్మాయి అడుగుపెట్టినా ఎందుకు తిరిగిరాదు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
గదులు మనుషులను భయపెట్టవు.. దాని చుట్టూ అల్లే కథలే భయపెడతాయి అని డాక్టర్ చెప్పే డైలాగ్, అలాగే ఆ గదిలోకి ఏ మహిళ అడుగుపెట్టినా ఆమె ప్రాణాలతో తిరిగి రాదనే హెచ్చరికలు ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భయానకమైన విజువల్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తూ హారర్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. గూస్‌బంప్స్ తెప్పించే సౌండ్ డిజైనింగ్ ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ట్రైలర్ తో అంచనాలు మరింత పెంచేశారు. హారర్ డ్రామా కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.