ప్రశాంత్ నీల్ సమర్పించు.. స్పైన్ హారర్ థ్రిల్లర్ 418
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:43 PM
టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శ కుడు ప్రశాంత్ నీల్ అనూహ్యమైన కలయికలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), మాస్ యాక్షన్ చిత్రాల దర్శ కుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అనూహ్యమైన కలయికలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ, సరికొత్త హారర్ థ్రిల్లర్ కథాంశంతో వీరు నిర్మిస్తున్న చిత్రానికి 418 (418 Movie) అనే వైవిధ్యమైన టైటిల్ ను ఖరారు చేశారు. కీర్తన్ నాదగౌడ (Kirtan Nadagouda) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు.
ఆదివారం విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఒక మారుమూల గ్రామం నేపథ్యంలో కథ సాగనుంది. 'హారర్ చిత్రాలంటే దెయ్యాలు, ఆత్మలు అనుకుంటారు. కానీ '418' చిత్రం సైన్స్, మిస్టరీ, మూఢ నమ్మకాల మధ్య ఉండే సన్నని గీతను, ఇప్పటి వరకూ వెలుగు చూడని ఒక రహస్యాన్ని స్పృశించబోతోందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సూర్యరాజ్ (Surya Raj), హను రెడ్డి (Hanu Reddy), ప్రీతి పగడాల (Preethi Pagadala) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.