NTR: 4 నెలల్లో 15 కేజీలు.. ఏం డెడికేషన్ అన్నా.. ప్రాణం ఇచ్చేస్తావా

ABN , Publish Date - May 20 , 2026 | 08:42 PM

సినిమా కోసం ఏ హీరో అయినా కష్టపడతాడు. కానీ, ఒక సినిమా కోసం ప్రాణం పెట్టే హీరోలు కేవలం టాలీవుడ్ లోనే ఉన్నారు అంటే అది ఎంతో గర్వకారణమని చెప్పొచ్చు.

NTR

సినిమా కోసం ఏ హీరో అయినా కష్టపడతాడు. కానీ, ఒక సినిమా కోసం ప్రాణం పెట్టే హీరోలు కేవలం టాలీవుడ్ లోనే ఉన్నారు అంటే అది ఎంతో గర్వకారణమని చెప్పొచ్చు. అలా సినిమా కోసం ప్రాణం పెట్టే హీరోల్లో ఎన్టీఆర్ (NTR) ముందు వరుసలో ఉంటాడు. లుక్, హెయిర్, బరువు.. ఇలా ఏదైనా సరే ఒక సినిమాకు అవసరం అని డైరెక్టర్ చెప్తే దాన్ని సాధించేవరకు నిద్రపోడు. సినిమా కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు అని చెప్పొచ్చు. తాజాగా ఎన్టీఆర్ డ్రాగన్ (Dragon) సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం డ్రాగన్. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా డ్రాగన్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో తారక్ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. దేవర సినిమాలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్.. పూర్తిగా బక్కచిక్కి పేషేంట్ లా తయారయ్యాడు. నీల్ సినిమా అంటే మంచి ఫిజిక్ తో ఉండాలి కానీ, ఎన్టీఆర్ సన్నబడ్డాడు ఏంటి.. ఏదైనా జరిగిందా.. ? అనారోగ్యమా అని ఎన్నో అనుమానాలు. కానీ, ఆ అనుమానాలకు నీల్ క్లారిటీ ఇచ్చాడు. తాను చెప్పడం వలనే ఎన్టీఆర్ బరువు తగ్గాడని, అది కూడా 4 నెలల్లో 15 కేజీలు తగ్గి చూపించాడని చెప్పాడు.


' లుక్ టెస్ట్ కోసం చేసినప్పుడు తారక్ కి నేను చెప్పాను. క్రిమినల్ రోల్ కదా కొంచెం సన్నగా ఉంటే బావుంటుంది అన్నాను. 4 నెలలు షూట్ బ్రేక్ తీసుకొని 15 కేజీలు తగ్గాడు. చాలాసార్లు వద్దు.. ఆపేయ్ అన్నాను. అయినా సరే తారక్ వెనక్కి తగ్గలేదు. తారక్ పరిస్థితి చూసి ఆయన భార్య ప్రణతితో పాటు, నా సొంత టీమ్ కూడా నాపై చాలా అప్సెట్ అయ్యారు. ఆ స్టోరీ, నీ విజన్ కోసం తగ్గుతాను అన్నాడు. ఈవినింగ్ 7 గంటలకు ఆ మాట చెప్పాను. 7. 30 నిమిషాలకు జిమ్ ట్రైనర్ కి కాల్ చేశాడు. ఆ తరువాత ఉదయం నుంచి వర్క్ అవుట్ స్టార్ట్ చేశాడు. సినిమా పట్ల, తన క్యారెక్టర్ పట్ల తారక్ చూపించిన డెడికేషన్ నిజంగా అద్భుతం' అని తెలిపాడు. ఇక తారక్ డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏం డెడికేషన్ అన్నా.. ప్రాణం ఇచ్చేస్తావా సినిమా కోసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - May 20 , 2026 | 09:03 PM