ఆగిపోయిన సలార్ 2 .. నీల్ ఏమన్నాడంటే
ABN , Publish Date - May 22 , 2026 | 07:59 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్ (Salaar).
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్ (Salaar). ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసిన సినిమాల్లో సలార్ ఒకటి. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్ 2 ని ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేశాడు. శౌర్యంగ పర్వం అనే టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కనుందని నీల్ అధికారికంగా ప్రకటించాడు. దాదాపు మూడేళ్ళు అవుతున్నా ఈ సీక్వెల్ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మధ్యలో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.
నీల్ సైతం శౌర్యంగ పర్వాన్ని పక్కన పెట్టి డ్రాగన్ మీద ఫోకస్ చేశాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక ఈ మధ్యనే నీల్.. డ్రాగన్ గురించి మాట్లాడుతూ ఇలాంటి గ్యాంగ్ స్టర్ మూవీస్ తీసి బోర్ కొట్టేసింది. డార్క్ మోడ్ లో డ్రాగన్ లాస్ట్ సినిమా అని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. అంటే సలార్ సీక్వెల్ లేనట్టేనా.. ? అని అసహనం వ్యక్తం చేశారు.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్నారు అని అర్ధం చేసుకున్న నీల్.. వెంటనే సలార్ 2 కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా డ్రాగన్ మీదనే ఉందని, ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే సలార్ 2 మొదలుకానుందని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే ఏడాదిలో సలార్ 2 పట్టాలెక్కనుందని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ఫౌజీ, కల్కి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు.