Hanu-man 3D: ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. డైరెక్టర్ ఎక్కడ

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:50 PM

టాలీవుడ్ ని పాన్ ఇండియా లెవెల్ లో నిలబెట్టిన చిత్రాల్లో హనుమాన్ (Hanuman) కూడా ఒకటి. 2024 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ని పాన్ ఇండియా లెవెల్ లో నిలబెట్టిన చిత్రాల్లో హనుమాన్ (Hanuman) కూడా ఒకటి. 2024 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హనుమాన్ సక్సెస్ తరువాత తేజ రేంజ్ మారిపోయింది. అంతా బావుంది అనుకొనే టైమ్ లో ప్రశాంత్ వర్మ- నిరంజన్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెల్సిందే.


తాజాగా హనుమాన్ సినిమా జూన్ 25 న త్రీడీ వెర్షన్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ చిత్ర 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఆదివారం ఘనంగా నిర్వహించింది. మెగా హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుకలో హీరో తేజ సజ్జా, నిర్మాత కె. నిరంజన్ రెడ్డితో పాటు మిగిలిన సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అయితే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌లో సినిమాను క్రియేట్ చేసిన మెయిన్ కెప్టెన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కడా కనిపించకపోవడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి కారణం డైరెక్టర్ - ప్రొడ్యూసర్ మధ్య గొడవలే అని టాక్.


దర్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య బడ్జెట్ మరియు లాభాల వాటా విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ గొడవ కాస్తా సోషల్ మీడియా వేదికగా పరోక్ష యుద్ధానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు కూడా. సక్సెస్ తెచ్చిన క్రెడిట్, లాభాల పంపకాల చుట్టూ తిరిగిన ఈ వివాదం వల్ల ఈ క్రేజీ కాంబినేషన్ పూర్తిగా విడిపోయింది. ఈ గొడవల తాలూకు ప్రభావం 'హనుమాన్ సీక్వెల్ అయిన జై హనుమాన్ ప్రాజెక్ట్‌పై గట్టిగా పడింది. పాత ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డితో కలిసి ఈ సీక్వెల్ చేయకూడదని గట్టిగా డిసైడ్ అయిన ప్రశాంత్ వర్మ, జై హనుమాన్ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో పెట్టాడు.


ఇక ఇప్పుడు నిరంజన్ రెడ్డి.. ప్రశాంత్ వర్మకు చెప్పకుండానే హనుమాన్ సినిమాను 3డిలో రిలీజ్ చేస్తున్నాడా.. ? లేక డైరెక్టర్ కి చెప్పినా కూడా ఈ ప్రమోషన్స్ కి రాలేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన హనుమాన్ సినిమాను సృష్టించిన ఘనత కచ్చితంగా ప్రశాంత్ వర్మకే దక్కుతుంది. అలాంటి కెప్టెన్ లేకుండా ఈ సినిమా ప్రమోషన్స్ సవ్యంగా సాగుతాయా.. లేదా.. అనేది చూడాలి.

Updated Date - Jun 21 , 2026 | 09:14 PM