Prakash Raj: యువత భయానికి.. మన మహాప్రభువు రీల్స్ చేసుకుంటున్నాడు

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:25 AM

సెన్సార్ షిప్ ఇవాళ ఎస్ఐఆర్ వంటి రకరకాల రూపాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు.

Prakash Raj

సెన్సార్ షిప్ ఇవాళ ఎస్ఐఆర్ వంటి రకరకాల రూపాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) విమర్శించారు. ఆ నియంత్రణ పర్యవసానమే ఇప్పుడు మనమంతా అనుభవిస్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా భాషలో చెప్పాలంటే రీజనల్ సెన్సార్ బోర్డు ప్రాధాన్యం పూర్తిగా తగ్గి, ఆ స్థానంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు జోక్యం మితిమీరిందని మండిపడ్డారు.

'జననాయగన్'తో పాటు 'సరస్వతి' అనే మరొక సినిమాలోని ఓ సన్నివేశంలో కూడా తాను పలికే సంభాషణలపై అనవసరమైన అభ్యంతరాలు తెలుపుతూ సెన్సార్ బోర్డు ఇబ్బంది పెట్టిందని తెలిపారు. మోదీని మహాప్రభువు, రాక్షసుడిగా పోలుస్తూ ఎద్దేవా చేశారు. యువత భయానికి మన మహాప్రభువు రీల్స్ చేసుకుంటున్నాడంటూ ఎగతాళి చేశారు. నియంతృత్వంపై పోరాటం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

Prakash Raj

చాయా పబ్లికేషన్స్ ప్రచురించిన 'అదృశ్య కథనం (కె సత్యరంజన్), 'నిషేధిత పుస్తకాల లైబ్రరీ' (అరి పిరాల సత్యప్రసాద్), 'మూక' (మానస ఎండ్లూరి) తెలుగు అనువా దాలను గురువారం లామాకాన్‌లో ప్రకాష్ రాజ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారాన్ని ప్రయోగించడం ద్వారా దేశమంతటా భయాన్ని ఒక వ్యాధిలా ప్రబలేలా చేస్తున్నారంటూ బీజేపీ పై ధ్వజమెత్తారు.

అన్యాయంతో రాజీపడడానికి తానేమీ ప్రవాహంలో కొట్టుకుపోయే చచ్చిన చేపను కాదని, ఏటికి ఎదురీదే జీవమున్న చరాన్ని అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. సీనియర్ ఎడిటర్లు కె. శ్రీనివాస్, అల్లం నారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరేట్. ఒక్కో పుస్త కాన్ని సమీక్షించారు. అనువాదకులను ప్రశంసించారు. చాయా ప్రచురణల నిర్వాహకులు మోహన్ బాబు, సంపాదకుడు అరుణాంక్ ప్రయత్నాన్ని అభినందించారు.

Updated Date - Sep 11 , 2026 | 07:41 AM