Spirit: ప్రభాస్ స్పిరిట్.. రిలీజ్ ఎప్పుడంటే
ABN , Publish Date - Jan 16 , 2026 | 06:44 PM
ప్రభాస్ (Prabhas) ఈ ఏడాది సంక్రాంతికి ద రాజాసాబ్ (The Raja Saab) సినిమాతో వచ్చి అభిమానులను కొద్దిగా నిరాశపర్చాడు.
Spirit: ప్రభాస్ (Prabhas) ఈ ఏడాది సంక్రాంతికి ద రాజాసాబ్ (The Raja Saab) సినిమాతో వచ్చి అభిమానులను కొద్దిగా నిరాశపర్చాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక మొదటి షోకే మంచి మంచి సీన్స్ ని కట్ చేయడంతో అభిమానులు పెదవి విరిచారు. ఆ తరువాత రోజు నుంచి ఆ సీన్స్ యాడ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్.. ఆశలన్నీ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పిరిట్(Spirit) పైనే పెట్టుకున్నారు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో స్పిరిట్ ని మొదలుపెట్టాడు.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తారా.. ? ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని తగలబెట్టేసింది. షర్ట్ లేకుండా ఒంటినిండా దెబ్బలతో చేతిలో మందు బాటిల్ తో ఎదురుగా హీరోయిన్ త్రిప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తూ ఉన్న పోస్టర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తానికి మతులు పోగొట్టేలా చేసింది.
ఇక ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాడు వంగా.. ఆడియో గ్లింప్స్ తోనే అదిరిపోయిన ఫ్యాన్స్.. ఈ పోస్టర్ చూసి పిచ్చెక్కిపోయారు. ఈ ఏడాదిలో స్పిరిట్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ ఎదురయ్యింది. స్పిరిట్ ఈ ఏడాదిలో కాదు వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా వంగా స్పిరిట్ రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి5 న రిలీజ్ కానుందని తెలిపాడు.వచ్చే ఏడాది సమ్మర్ స్పిరిట్ తో మరింత హీట్ ఎక్కనుంది. మరి ఈ సినిమాతో వంగా - ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.