ప్రభాస్ ‘స్పిరిట్’లో అసలు విధ్వంసం అప్పుడే.. క్లైమాక్స్ కోసం భారీ ప్లాన్

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:54 PM

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ క్లైమాక్స్ కోసం భారీ సెట్ సిద్ధమవుతున్నట్లు టాక్.

Prabhas, Spirit

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన లైనప్‌లో ఎన్నో భారీ సినిమాలు ఉన్నప్పటికీ, అనౌన్స్‌మెంట్ వచ్చిన నాటి నుంచే ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమా స్పిరిట్ (Spirit). సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga)దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుండటంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. సరిగ్గా ఈ సమయంలో స్పిరిట్ సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, స్పిరిట్ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ ఒక భారీ సెట్‌ను నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంత ఇంటెన్స్‌గా, ఎంత ఎమోషనల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే స్పిరిట్ కోసం కూడా మునుపెన్నడూ చూడని రీతిలో యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే సరికొత్త షెడ్యూల్‌లో ఈ హై-వోల్టేజ్ క్లైమాక్స్ భాగాన్ని చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా, ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ప్రభాస్ పై ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయబోతున్నారట. ప్రభాస్ మాస్ స్వాగ్‌కు తగినట్లుగా ఈ పాట విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్నాయి. ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ కాప్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రభాస్ ఒక సిన్సియర్, అదే సమయంలో అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఖాకీ డ్రెస్సులో ప్రభాస్ లుక్ ఇప్పటికే ఊహించుకుంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కేవలం పోలీస్ ఆఫీసర్‌గానే కాకుండా, ఈ చిత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాస్ క్యారెక్టర్ అత్యంత వైల్డ్, ఊర మాస్ అవతార్‌లో కనిపించబోతోందట. సందీప్ మార్క్ రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్‌కు ప్రభాస్ కటౌట్ తోడైతే థియేటర్లలో రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

స్పిరిట్ కాస్టింగ్ విషయానికి వస్తే, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తోంది. యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి కి, ప్రభాస్ సరసన ఇది ఒక భారీ అవకాశం. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్‌ లుక్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌ గానే ఉంది. పోస్టర్‌లోనే వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సందీప్‌, ఇక సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్‌ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే, ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్, సందీప్ రెడ్డి వంగా సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా కథలంటేనే రెగ్యులర్ ఫార్మాట్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి. స్పిరిట్ మెయిన్ కథాంశం కూడా పూర్తి వినూత్నంగా, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని కాన్సెప్ట్‌తో రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Updated Date - Nov 02 , 2026 | 07:04 PM