Miracle: హెబ్బా పటేల్.. 'మిరాకిల్'.. ఫస్ట్ లుక్ విడుదల
ABN , Publish Date - Jan 16 , 2026 | 02:16 PM
రణధీర్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా 'మిరాకిల్'. శ్రీరామ్, సురేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
'సత్య గ్యాంగ్, ఫైటర్ శివ' చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల తాజా చిత్రం 'మిరాకిల్'. ఈ సినిమాను రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణధీర్ భీసు హీరోగా నటిస్తుండగా అతని సరసన హెబ్బా పటేల్ నాయికగా నటిస్తోంది. అక్షర నున్న మరో హీరోయిన్! ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ లో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ జనవరి 22 నుండి హైదరాబాద్ పరిసరాల్లో మొదలు కానుంది. జనవరి 16న సంక్రాంతి కానుకగా 'మిరాకిల్' నుండి హీరో, హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్నా ఈ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
'మిరాకిల్' మూవీలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్ గా పరిచయమవుతున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఇందులో ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ప్రభాస్ నిమ్మలే సంగీతమూ అందిస్తున్నాడు. ఇందులోని పాటలను రాంబాబు గోసాల రాస్తున్నాడు.