Tollywood: హెబ్బా పటేల్ నాయికగా 'మిరాకిల్'
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:57 PM
గతంలో 'సత్య గ్యాంగ్, ఫైటర్ శివ' చిత్రాలను రూపొందించిన ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మిరాకిల్'. ఈ సినిమాలో హెబ్బ పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'మిరాకిల్' (Miracle). గతంలో 'సత్య గ్యాంగ్, ఫైటర్ శివ' చిత్రాలను రూపొందించిన ప్రభాస్ నిమ్మల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదల కానుంది.
రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ (Hebbah Patel) హీరోయిన్. ఆకాంక్ష మరో హీరోయిన్. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, ప్రభాస్ సంగీతం సమకూర్చుతున్నారు. పాటలను రాంబాబు గోసాల రాస్తున్నారు.