Prabhas: ఫౌజీ షూటింగ్‌కు బ్రేక్.. యూరప్‌కు వెళ్లిన ప్రభాస్
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:00 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొద్దీ రోజుల ముందు వరకు ‘ఫౌజీ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొద్దీ రోజుల ముందు వరకు ‘ఫౌజీ’ (fauzi) షూటింగ్లో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొన్న ప్రభాస్ కాస్త విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా యూరప్‌కు పయనమైనట్లు సమాచారం. యూరప్‌లో కొద్దిరోజులు గడిపిన అనంతరం ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొంటారని, ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.
హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తర్వాత, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. శుక్రవారం విడుదల చేసిన 'ఫౌజీ’ టీజర్ అభిమానులను ఆకట్టుకోగా, మరి కొందరు అయితే సీన్స్ ని కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చ్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మినిమమ్ సెన్స్ లేకుండా నెగిటివ్ చేయాలని చూశారు: ‘రణబాలి’ దర్శకుడు
ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?
ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?