పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్? కానీ
ABN , Publish Date - Nov 09 , 2026 | 06:08 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఫౌజీ ఒకటి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఫౌజీ (Fauzi) ఒకటి. లవ్ స్టోరీలను వెండితెరపై కావ్యంలా మలిచే డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటికొచ్చి ఇండస్ట్రీని, ప్రభాస్ అభిమానులను ఊపేస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని కోట్లాది మంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్‌లో ప్రభాస్ పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయో ప్రస్తుతానికి సస్పెన్సే కానీ.. రీల్ లైఫ్‌లో మాత్రం డార్లింగ్ పెళ్లి పీటలెక్కేశాడట. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లోనే మేకర్స్ ఒక భారీ వెడ్డింగ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ప్రభాస్, ఇమాన్వీల వివాహ ఘట్టాన్ని దర్శకుడు అత్యంత ఘనంగా, కళ్లు చెదిరేలా తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ గ్రాండ్ మ్యారేజ్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసమే ప్రభాస్ నవంబర్ 7న ఫౌజీ సెట్స్‌లో అడుగుపెట్టాడట.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక భారీ సెట్లో, అద్భుతమైన ఆర్ట్ వర్క్‌తో పాతకాలపు వైభవం ఉట్టిపడేలా ఈ పెళ్లి తంతును ప్లాన్ చేశారట. హను రాఘవపూడి సినిమాల్లో ప్రేమకథలు ఎంత పొయెటిక్‌గా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ఈ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే పెళ్లి సీన్‌ను కూడా తనదైన పొయెటిక్ అండ్ విజువల్ స్టైల్లో రూపుదిద్దుతున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ స్వాతంత్ర్యానికి పూర్వం సాగే మిలిటరీ కల్నల్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయబద్ధంగా, 1940ల నాటి వాతావరణాన్ని, పాతకాలం నాటి ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా సాగే ఈ వెడ్డింగ్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్‌లా ఉండబోతోందట.
అసలే ఫౌజీ సినిమా లాంచింగ్ ఈవెంట్లోనే ప్రభాస్, ఇమాన్వీల జంటను చూసి ఫ్యాన్స్ పూర్తిగా ఫిదా అయిపోయారు. ఇద్దరి మధ్య స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉందనే కామెంట్స్ వచ్చాయి. తెరపై వీళ్లిద్దరి కెమిస్ట్రీ గనక పర్ఫెక్ట్గా వర్కవుట్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఏకంగా వీళ్లిద్దరి పెళ్లి సీన్‌నే షూట్ చేస్తున్నారన్న వార్త రావడంతో.. ఆన్ స్క్రీన్ మీద డార్లింగ్ పెళ్లి కొడుకు గెటప్‌లో ఎలా మెరవబోతున్నాడా అని అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ పీరియాడిక్ డ్రామాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తులతో పాటు సీనియర్ నటులు భానుచందర్, జయప్రద వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సీతారామం వంటి మ్యూజికల్ హిట్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటంతో పాటలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి రియల్ లైఫ్ మ్యారేజ్ మేటర్ ఎలా ఉన్నా, ‘ఫౌజీ’ సెట్స్‌లో ప్రభాస్ పెళ్లి హడావుడి మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ సీక్వెన్స్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందో చూడాలి. వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మరి..