ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. మరో రెండు రోజుల్లో ‘ఫౌజీ’ సెట్స్‌లోకి డార్లింగ్!
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:39 PM
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఫౌజీ’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. అందులోని మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ (Fauzi). టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరసన అందాల భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ఇటీవల వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే, ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి' సీక్వెల్ షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయిన ప్రభాస్.. తాజాగా మరోసారి తన దృష్టిని 'ఫౌజీ' సినిమాపై పెట్టారట. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మరో రెండు రోజుల్లో డార్లింగ్ ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్లో తిరిగి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ జోరు పెంచనున్నారట మేకర్స్. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది మార్చి నెలలో 'ఫౌజీ'ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అద్భుతమైన హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు అలనాటి దిగ్గజ నటి జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ఆయన మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొత్తానికి ప్రభాస్ నుంచి రాబోతున్న మరో విజువల్ వండర్ 'ఫౌజీ' అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఈ పీరియాడికల్ కథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.