ఆ స్టార్స్ ప్రభాస్ ని కావాలనే పక్కన పెట్టారా

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:36 PM

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో బర్త్ డే వస్తుంది అంటే.. వారం నుంచే సందడి మొదలవుతుంది. ఆ హీరో నటించే సినిమాల నుంచి పోస్టర్స్, వీడియో అప్డేట్స్ ఒక ఎత్తు అయితే.. ఇండస్ట్రీ మొత్తం ఆ హీరో రేర్ ఫోటోస్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మరో ఎత్తు.

Prabhas

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో బర్త్ డే వస్తుంది అంటే.. వారం నుంచే సందడి మొదలవుతుంది. ఆ హీరో నటించే సినిమాల నుంచి పోస్టర్స్, వీడియో అప్డేట్స్ ఒక ఎత్తు అయితే.. ఇండస్ట్రీ మొత్తం ఆ హీరో రేర్ ఫోటోస్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మరో ఎత్తు. అలాంటిది రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే ఇంకెలా ఉండాలి. సోషల్ మీడియా తగలాడిపోవాలి. బర్త్ డే విషెస్ తో ఎక్స్ లో డార్లింగ్ పేరు ట్రెండింగ్ లో ఉండాలి. కుర్ర హీరో దగ్గర నుంచి సీనియర్ హీరో వరకు ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలతో కళకళలాడిపోతూ ఉండాలి. కానీ, ఈసారి మాత్రం ఇలా జరగలేదు. ప్రభాస్‌కు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపకపోవడంపై అభిమానుల్లో కొంత అసహనం వ్యక్తమవుతోంది.


అక్టోబర్ 23 న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ఫ్యాన్స్ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఏఐ వీడియోలు, ఫోటోలతో ట్రెండ్ సృష్టించారు. కొంతమంది కుర్ర హీరోలు, హీరోయిన్లు కూడా డార్లింగ్ కి విషెస్ తెలిపారు. అయితే ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసిన హీరోల దగ్గర నుంచి మాత్రం డార్లింగ్ కి విషెస్ రాలేదు. దీంతో ఇండస్ట్రీ హీరోలు ప్రభాస్ ని కావాలనే పక్కన పెట్టారా.. ? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.


ప్రభాస్ పుట్టిన రోజుకు సరిగ్గా ఒక్క రోజు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టిన రోజు వేడుక జరిగింది. ఆయన పుట్టినరోజున టాలీవుడ్‌ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు అమిత్ షాకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ, తమ తోటి నటుడు, పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్‌కు మాత్రం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపలేదంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా దేశానికి కేంద్ర మంత్రి కావడం వల్ల ఆయనకు విషెస్ చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు, కానీ అమిత్ షాకు స్పందించినవారే ప్రభాస్‌ను ఎందుకు విస్మరించారు అనేది ఫ్యాన్స్ వాదన. ప్రభాస్ తో అందరూ మంచిగానే ఉంటారు. కానీ, ఆయన పుట్టినరోజును మరిచారా.. ? లేక కావాలానే చేయలేదా..? అని మండిపడుతున్నారు.


ఇక ఈ వివాదంపై సినీ విశ్లేషకులు స్పందిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన ఇండస్ట్రీ హీరోల మధ్య వ్యక్తిగతంగా దూరాభిప్రాయాలు ఉన్నాయని అనుకోవడానికి లేదని, టాలీవుడ్ స్టార్స్ అందరూ ఎంతో సన్నిహితంగా ఉంటారని, వారు పర్సనల్‌గా ఫోన్ చేసి లేదా నేరుగా విషెస్ తెలిపి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఈ చిన్న విషయాలు పెద్దవి కావని, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయడమే మంచిదని, లేదంటే ఇది పెద్ద ఫ్యాన్ వార్‌కు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని ఇంతటితో వదిలేస్తారా.. ? లేదా..? అనేది చూడాలి.

Updated Date - Oct 24 , 2026 | 06:43 PM