Director Maruthi: ఇంకా మారుతిని వదలని ప్రభాస్ ఫ్యాన్స్.. ఏంటయ్యా ఈ అరాచకం
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:47 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజాసాబ్ (The Raja Saab). సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
Director Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజాసాబ్ (The Raja Saab). సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ట్రైలర్ లో చూపించిన సీన్స్ ను సినిమాలో పెట్టకపోవడం, కథ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో రాజా సాబ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతికి చుక్కలు చూపిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ సమయంలో మారుతి.. రాజా సాబ్ 1% ఫ్యాన్స్ ను నిరాశపర్చినా నా ఇంటి అడ్రెస్ పెడతాను.. అక్కడికి రండి అని చెప్పాడు. అంతే.. సినిమా నిరాశపర్చడంతో అభిమానులు మారుతిపై మండిపడడం మొదలుపెట్టారు.
మారుతి ఇంటి అడ్రెస్ తెలియడంతో ఫ్యాన్స్ అరాచకం చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఫుడ్ ఆర్డర్స్ పెడుతూ వేధిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ పార్శిల్స్ ఎక్కువగా రావడంతో మారుతి ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి.. ఫుడ్, అమెజాన్ లో కొన్ని వస్తువులను మారుతి ఇంటి అడ్రెస్ కి పంపుతున్నారు. వాచ్ మెన్ మారుతికి ఫోన్ చేసి ఆర్డర్ వచ్చిందని చెప్తే.. తాను ఏ ఆర్డర్ పెట్టలేదని, ఎలాంటి ఆర్డర్ వచ్చినా కూడా లోపలికి పంపవద్దని చెప్పినట్లు తెలుస్తోంది.
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న దాడికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు.. ? అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కచ్చితంగా ఈ అరాచకం ఆగాలి అంటే ప్రభాస్ రంగంలోకి దిగాలని అంటున్నారు. మీడియా ద్వారా కానీ, ఒక పోస్ట్ ద్వారా కానీ ప్రభాస్.. ఫ్యాన్స్ ని ఆగమని చెప్తే వారు వింటారని, ఇలాంటివి చేయడం ఆపుతారని అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా ఫ్యాన్స్ ని నిరాశపరిస్తే ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ప్రభాస్ వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.