డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా రోమాంచకమే..
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:05 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూనే, చిన్న సినిమాలకు, యంగ్ టాలెంట్‌కు తనవంతు మద్దతు అందిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూనే, చిన్న సినిమాలకు, యంగ్ టాలెంట్‌కు తనవంతు మద్దతు అందిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ మూవీ రోమాంచకం చిత్ర బృందానికి డార్లింగ్ ప్రభాస్ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సినిమా ప్రమోషన్లలో భాగంగా రోమాంచకం చిత్ర యూనిట్ ప్రభాస్‌ను ప్రత్యక్షంగా కలిసింది. ఈ సందర్భంగా మేకర్స్‌తో ఎంతో సరదాగా గడిపిన ప్రభాస్, సినిమా పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్‌ను చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ స్పిరిట్ లో నటిస్తున్న ప్రభాస్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. రోమాంచకం చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి, తమ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా కలెక్షన్లను కూడా దాటేయాలని ఆయన సరదాగా కామెంట్స్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఊహించని రీతిలో వచ్చిన ఈ సపోర్ట్, బెస్ట్ విషెస్‌తో రోమాంచకం టీమ్ అమితానందం వ్యక్తం చేస్తోంది. యంగ్ క్రియేటర్లను ప్రోత్సహిస్తూ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను సమర్పిస్తుండటం, దానికి ప్రభాస్ ఆశీస్సులు కూడా తోడవ్వడంతో ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నిజంగా ఇలా ప్రభాస్ ని కలవడం ఫ్యాన్స్ గా తమకు రోమాంచకమే అని చిత్రబృందం చెప్పుకొస్తున్నారు. సెప్టెంబర్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.