ప్రభాస్‌: ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చూస్తుంటే ఆ సినిమా గుర్తొచ్చింది..

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:39 PM

ప్రభాస్‌కు ఫుడ్‌ అన్నా, ఫ్రెండ్స్‌ అన్నా ప్రాణం. నచ్చింది ఎంత ఇష్టంగా తింటారో.. ఫ్రెండ్స్‌తో అంతే ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. ఖాళీ సమయంలో ఆయన చుట్టూ ఓ డజను మంది స్నేహితులుంటారు.


ప్రభాస్‌కు (Prabhas) ఫుడ్‌ అన్నా, ఫ్రెండ్స్‌ అన్నా ప్రాణం. నచ్చింది ఎంత ఇష్టంగా తింటారో.. ఫ్రెండ్స్‌తో అంతే ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. ఖాళీ సమయంలో ఆయన చుట్టూ ఓ డజను మంది స్నేహితులుంటారు. అందరూ కూర్చుని తింటుండే.. ఆయన కంచంలో చేయి పెట్టే పని ఉండదు. స్నేహితులే ముద్దలుగా చేసి తినిపిస్తారు. ఆయనంటే స్నేహితులకు అంత ప్రాణం. తాజాగా ఆయన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’(Couple friendly) సినిమా చూశారు. తర్వాత చిత్ర యూనిట్‌తో సరదాగా చిట్‌చాట్‌ చేశారు. అందులో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఫుడ్‌ గురించి మాట్లాడారు.

చెన్నై నుంచి ముంబైకి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టా..
ఆదిపురుష్‌ చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ విషయం గురించి చెబుతూ ‘ఫ్యాన్స్‌కు, ఆడియన్స్‌ నేను తినే ఫుడ్‌ గురించి తెలుసుకోవాలనుకుంటారు. మీకో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ చెబుతాను. నేను అప్పుడప్పుడు వేరే రాష్ర్ట్రాల నుంచి ఫుడ్‌  తెప్పిస్తుంటాను. ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ ముంబైలో జరుగుతుండగా చెన్నై నుంచి ఫుడ్‌ ఆర్డర్‌  పెట్టా. టీమ్‌ అంతా షాక్‌ అయ్యారు. ఫ్లైట్‌లో ఫుడ్‌ తీసుకొచ్చిన మనిషి నా దగ్గరకు వచ్చి ‘మీరు మాములు వాళ్లు కాదండీ’ అన్నాడు’ అని ఆ జ్ఞాపకాలను ప్రభాస్‌ గుర్తు చేసుకున్నారు.

'గీతాంజలి' చూసిన ఫీలింగ్‌ కలిగింది.
హీరోయిన్‌ మానస వారణాసి కూడా ప్రభాస్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీ దృష్టిలో ప్రేమంటే ఏంటి?’ అని ప్రశ్నించగా.. ఇది పర్సనల్‌ క్వశ్చన్‌ అంటూ నవ్వేశారు. ప్రస్తుతం నాకు లవ్‌ అనగానే ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ గుర్తొస్తుంది. ఈ సినిమా చూశాక ప్రేమలో పడాలని ఉంది. మణిరత్నం తీసిన గీతాంజలి చిత్రమంటే చాలా ఇష్టం. ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చూస్తుంటే నాకు గీతాంజలి సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగింది. అందుకే ఈ సినిమాను నాలుగుసార్లు చూడాలనుకుంటున్నా’ అన్నారు. 

Updated Date - Feb 20 , 2026 | 05:39 PM