ప్రభాస్ బర్త్డే ట్రీట్.. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 నుంచి సర్ప్రైజ్ అప్డేట్స్!
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:10 AM
ప్రభాస్ బర్త్డే వేళ అభిమానులకు వరుస సర్ప్రైజ్లు!
నేడు ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా సూపర్ అప్డేట్స్తో ఆయన అభిమానులను ఖుషీ చేయనున్నారు మేకర్స్. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఫౌజీ (Fauzi) నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ తో పాటు సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ (Spirit) నుంచి ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగానే రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ (Fauzi) చిత్రబృందం అభిమానులకు ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. ‘డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25’ పేరుతో ‘అతను ఎవరు?’ అనే ప్రశ్నను తెరపైకి తెచ్చిన చిత్రబృందం, ఈరోజు విడుదల చేయనున్న వీడియోతో ఆ ప్రశ్నకు సమాధానం వెల్లడించనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వస్తున్న ఈ ప్రత్యేక వీడియో సినిమాపై అంచనాలను, అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
దీనితో పాటు ప్రభాస్ లీడ్ రోల్లో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki2898AD) సీక్వెల్ షూటింగ్లోకి ఇటీవలే అడుగుపెట్టగా భైరవ బ్యాక్ అంటూ అందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ఫ్రైజ్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ (Salaar2) చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘వయలెంట్ మ్యాన్’ అంటూ తమ అభిమాన కథానాయకుడిని అభివర్ణించిన చిత్రబృందం.. ‘సలార్ 2’ (Salaar 2) కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంది.
ఇదిలాఉంటే.. ప్రబాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ నుంచే కాకుండా నేషనల్ వైడ్గా సినీ, రాజకీయ ప్రముఖులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోలు గోపీచంద్, నారా రోహిత్, ఆది సాయి కుమార్, దర్శకులు శ్రీను వైట్ల, హను రాఘవపూడి, మారుతి, వేణు ఉడుగుల, సంపత్ నంది, వైజయంతి మూవీస్, హోంబలే ఫిలింస్ ప్రత్యేక పోస్టులతో శుభాకాంక్షలు తెలిపారు.