Prabhas- Anushka: దిష్టి తీయండ్రా మా అన్న వదినకి

ABN , Publish Date - Jun 26 , 2026 | 09:52 PM

భారతీయ చలనచిత్ర చరిత్రను తిరగరాసిన విజువల్ వండర్ బాహుబలి సిరీస్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దేవసేనగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) ల స్క్రీన్ ప్రెజెన్స్ , వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను పీకల్లోతు ప్రేమలో పడేసింది.

Prabhas - Anushka

భారతీయ చలనచిత్ర చరిత్రను తిరగరాసిన విజువల్ వండర్ బాహుబలి సిరీస్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దేవసేనగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) ల స్క్రీన్ ప్రెజెన్స్ , వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను పీకల్లోతు ప్రేమలో పడేసింది. ఒక ప్రాంతీయ చిత్రంగా మొదలై, ప్రపంచవ్యాప్తంగా రూ.2,400 కోట్లకు పైగా వసూళ్ల సునామీ సృష్టించి గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ అద్భుత సృష్టి ప్రారంభమై పదేళ్లు పూర్తైన సందర్భంగా, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన బాహుబలి: ది టార్చ్‌బేరర్ డాక్యుమెంటరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాహుబలి సినిమా మేకింగ్ వెనుక ఉన్న కఠిన శ్రమను, ఎవరికీ తెలియని ఆసక్తికరమైన నిజాలను ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, అనుష్కలు తమ పాత జ్ఞాపకాలను పంచుకోవడం ఈ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ లాంటి కీలక సభ్యులు పంచుకున్న విషయాలు ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి.


ఈ డాక్యుమెంటరీ అంతా ఒక ఎత్తు అయితే.. ప్రభాస్ - అనుష్క చాలా కాలం తరువాత కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్- అనుష్క.. ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతిఒక్కరూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. కానీ, వీరిద్దరూ మాత్రం తాము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్నారు. కనీసం ప్రభాస్ అప్పుడప్పుడైనా సోషల్ మీడియాలో కనిపిస్తాడు. కానీ, స్వీటీ కనిపించడం చాలా అరుదు. అలాంటిది.. ఇన్నేళ్ల తరువాత ఈ జంట కలిసి కనిపించడంతో మళ్లీ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి.


ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్ - అనుష్క ఎంతో చూడముచ్చటగా కనిపించారు. అనుష్క ట్రెడిషనల్ గ్రీన్ కలర్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతుండగా, ప్రభాస్ బ్లాక్ డ్రెస్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఇన్నేళ్ల తర్వాత తమ ఫేవరెట్ జోడీని ఇలా పక్కపక్కనే, అంతటి సంతోషకరమైన వాతావరణంలో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దిష్టి తీయండి అన్నా వదినలకి.. ఈ జంటను ఇలా చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి అంటూ ప్రభాస్, అనుష్కల బాండింగ్‌ను ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 09:59 PM