పడమటవీధి జానకి.. ఇంత అందంగా ఉందేంట్రా

ABN , Publish Date - Oct 27 , 2026 | 08:51 PM

టాలీవుడ్ కుర్ర హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య సిగ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Power Peta

టాలీవుడ్ కుర్ర హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య సిగ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా నిరాశపరిచింది. ఇక ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని సందీప్ కిషన్ గట్టిగా ప్లాన్ చేసాడు. ఆయన హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'పవర్‌పేట' (Power Peta). లవ్, హానర్, పాలిటిక్స్ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తుండడం విశేషం. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామాని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన సక్సెస్ ఫుల్ బ్యూటీ రితికా నాయక్ నటిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో ప్రత్యేకమైన గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో రితికా నాయక్‌ను పడమటవీధి జానకి అనే పాత్రలో ఎంతో అందంగా, ట్రెడిషనల్ లుక్‌లో పరిచయం చేశారు. పల్లెటూరి వాతావరణంలో, గ్లామరస్ అండ్ క్యూట్ లుక్స్‌తో రితికా నాయక్ కనిపిస్తున్న తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు. ముఖ్యంగా తడిబట్టలతో అందాలను ఆరబోస్తూ సెగలు పుట్టించింది. ఈ గ్లింప్స్ చుసిన నెటిజన్స్ ఇంత అందంగా ఉందేంట్రా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


రితికా నాయక్.. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రితికా వరుసగా మిరాయ్, కొరియన్ కనకరాజు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఈ చిన్నది ఏ సినిమాలో అడుగుపెడితే ఆ సినిమా హిట్ అనే పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పవర్‌పేట రితికా అడుగుపెట్టింది. ఈసారి ఎలాగైనా సందీప్ కి హిట్ ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి అమ్మడి లక్ తో సందీప్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Updated Date - Oct 27 , 2026 | 08:57 PM