Poonam Kaur: నాకు అబార్షన్ అయ్యింది.. రాహుల్ గాంధీతో ఎఫైర్ ఉంది

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:06 PM

పూనమ్ కౌర్ ?(Poonam Kaur).. అందం, అభినయం కలబోసిన నటి. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలతో కన్నా వివాదాల ద్వారానే పూనమ్.. ప్రేక్షకులకు తెలుసు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

Poonam Kaur

Poonam Kaur: పూనమ్ కౌర్ ?(Poonam Kaur).. అందం, అభినయం కలబోసిన నటి. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలతో కన్నా వివాదాల ద్వారానే పూనమ్.. ప్రేక్షకులకు తెలుసు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తన జీవితాన్ని సర్వ నాశనం చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) మీద ఆమె మా అసోసియేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఆ ఫిర్యాదును వారు తీసుకోలేదని వాపోయింది. ఇక సోషల్ మీడియాలో ఏ విషయం జరిగినా దానిని త్రివిక్రమ్ కి, పవన్ కళ్యాణ్ కి యాడ్ చేసి తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పటివరకు పూనమ్ ఏ ఒక్క యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. కానీ, తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చాలా విషయాలను పంచుకుంది. కానీ, వారి పేర్లు మాత్రం బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలోనే తన పెళ్లి గురించి, రాహుల్ గాంధీ తన చెయ్యి పట్టుకొని నడవడం గురించి వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టింది.

మొదటి నుంచి కూడా పూనమ్ ఒక హీరోతో ప్రెగ్నెంట్ అయ్యిందని, ఆ తరువాత అబార్షన్ చేయించారని వార్తలు వచ్చాయి. దాని గురించి కూడా పూనమ్ మాట్లాడింది. గతంలో తన హ్యాండ్ లూమ్ బిజినెస్ గురించి రాహుల్ గాంధీని కలిసినప్పుడు.. తన చెయ్యి పట్టుకొని నడుస్తుంటే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటి గురించి పూనమ్ మాట్లాడుతూ.. ' నాకు మ్యారేజ్ అయ్యిపోయింది.. అబార్షన్ కూడా అయ్యిపోయింది.. నాకు సీక్రెట్ పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత నాకు రాహుల్ గాంధీతో కూడా ఎఫైర్ ఉంది. ఇవన్నీ చెప్పినందుకు మీడియాకు థాంక్స్ చెప్పాలి.

నిజం చెప్పాలంటే నేను అనుకున్న పెళ్లి అవ్వలేదు. జనాలకు ఏం చెప్పాలో నాకు తెలియదు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. నా కుటుంబాన్ని కంట్రోల్ చేయగలను. వారిని ఎలా కంట్రోల్ చేయగలను. నేను రాహుల్ గాంధీ పార్టీకి నేను క్లోజ్ గా ఉంటే.. ఢిల్లీలో నా వర్క్ కి సంబంధించిన పనులను ఆపేవారా.. ? నాకొచ్చిన అవకాశాలను వేరేవారికి ఇచ్చేవారా.. ? ఒకవేళ నేను ఏదైనా పార్టీకి సపోర్ట్ గా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. పొలిటికల్ లీడర్స్ కు దగ్గరగా ఉన్న అమ్మాయిలకు ఏం కాదు. ఎవరైతే దూరంగా ఉంటారో వారి గురించి మాట్లాడతారు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 04 , 2026 | 03:06 PM