పూజా రెడ్డి ‘వ్యూ’.. ఈ నెల 20న థియేటర్లలోకి!
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:16 PM
పూజా రెడ్డి ప్రధాన పాత్రలో మహేశ్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వ్యూ’ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
పూజా రెడ్డి ప్రధాన పాత్రను పోషించిన సినిమా 'వ్యూ'. ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీలో ప్రదీప్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్య చౌదరి నిర్మిస్తున్నారు. మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించిన 'వ్యూ' మూవీని శ్రీలక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నటి సోనియా మాట్లాడుతూ, 'నేను ఎన్నో ఆడిషన్స్ కు వెళ్లాను. మంచి అవకాశం కోసం చూస్తున్న టైమ్ లో ఈ సినిమాలో ఆఫర్ దక్కింది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. ఒక మంచి క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని నమ్ముతున్నాను. చిత్ర పరిశ్రమలో కెరీర్ ఎంచుకునేందుకు నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కు థ్యాంక్స్. మా 'వ్యూ' మూవీని ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ, 'ఇది నా ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో నటించే క్రమంలో డైరెక్టర్ మహేశ్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ తో నా క్యారెక్టర్ ను బాగా పర్ ఫార్మ్ చేశానని నమ్ముతున్నాను. కొత్త తరహా కంటెంట్ తో మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉండబోతోంది' అని చెప్పారు. హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ, 'ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇలాంటి స్ట్రాంగ్ రోల్ నాకు కెరీర్ ప్రారంభంలోనే దక్కడం సంతోషంగా ఉంది. ఈ క్యారెక్టర్ లో నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. ట్రైలర్ లో ఎంత ఎనర్జీ ఉందో మీరు చూశారు. సినిమాలోనూ అంతే ఎనర్జీ ఉంటుంది. మా మూవీ సక్సెస్ మీట్ లో మరింత మాట్లాడుతాను' అని అన్నారు. ప్రొడ్యూసర్ సత్య చౌదరి మాట్లాడుతూ - నేను ఈ సినిమా చేసి ప్రొడ్యూసర్ గా మీ ముందు ఉన్నానంటే కారణం మా డైరెక్టర్ మహేశ్. ప్రతి క్రాఫ్ట్ ను ఆయనే దగ్గరుండి చూసుకుంటూ మంచి సినిమా చేశాడు. మా బాపిరాజు గారు సినిమాను రిలీజ్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ప్రచుర కంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ నాకు సపోర్ట్ గా నిలిచాయి. మీరంతా ఫ్యామిలీతో కలిసి మా సినిమాను చూడండి' అని కోరారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, 'ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ విజయవంతంగా కొనసాగుతోంది. చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. డబ్బింగ్ చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టే 'వ్యూ' చిత్రాన్ని మేం రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా దర్శకుడు మహేశ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇద్దరూ ఉన్నారు. మహేశ్ తో నేను ఒక మూవీని నిర్మించాలనుకుంటున్నాను8 అని అన్నారు. డైరెక్టర్ మహేశ్ కాంపెల్లి మాట్లాడుతూ, 'నేను ఎవరి దగ్గరా దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినిమా మీద ఉన్న ప్యాషన్ తో సాధ్యమైనంత బెస్ట్ టెక్నీషియన్స్ ను తీసుకున్నాను. ప్రతి ఒక్కరికీ ఒక వ్యూ ఉంటుంది. ఈ కథ నా వ్యూ పాయింట్ లో నుంచి చెప్పింది. ఒక మంచి సినిమా చేశానని మాత్రం గర్వంగా చెప్పగలను. నా సినిమాలన్నీ మనం నిజంగా చూసినట్లు, మన ఇంట్లో, పొరుగింట్లో జరిగినట్లు ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటి ఫీల్ ను కలిగిస్తుంది. నేను డైరెక్టర్ గా కంటే ఒక మంచి స్టోరీ టెల్లర్ గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
దుల్కర్ సల్మాన్‌కు.. తెలుగులో అసలైన అగ్నిపరీక్ష!
నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్.. 15 ఏళ్ల తర్వాత చైతూ, సుకుమార్ కాంబో మ్యాజిక్ చేస్తుందా?
హీరోయిన్ల బాక్సాఫీస్ వార్.. కల్యాణి రికార్డును రష్మిక బ్రేక్ చేస్తుందా?