బికినీలో బుట్టబొమ్మ.. అబ్బబ్బా ఏం అందమమ్మా

ABN , Publish Date - May 09 , 2026 | 07:22 PM

బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఎలాగైనా ఒక మంచి హిట్ ని అందుకోవాలని చాలా కష్టపడుతోంది. గత కొన్నేళ్లుగా పూజా ఖాతాలో ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కూడా లేదు.

Pooja Hegde

బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఎలాగైనా ఒక మంచి హిట్ ని అందుకోవాలని చాలా కష్టపడుతోంది. గత కొన్నేళ్లుగా పూజా ఖాతాలో ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కూడా లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ, విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. మధ్యలో ఒక ఏడాది రెస్ట్ తీసుకున్న పూజా.. మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. రెట్రో, దేవా సినిమాల్లో కనిపించినా.. అవి కూడా డిజాస్టర్ టాక్ ను అందుకున్నాయి.


వరుస ప్లాపులు వచ్చినా కూడా అమ్మడికి అవకాశాలు తగ్గడం లేదు. పూజా హెగ్డే ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా ఆమె హిందీలో నటించిన చిత్రం తేరా హో జాన్. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజాతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఒక హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో బికినీతో కనిపించి బుట్టబొమ్మ బెంబేలెత్తించింది.


షూట్ లో దిగిన బికినీ ఫోటోలను పూజా షేర్ చేసింది. ఫ్లోరల్ బికినీ టాప్ పై డెనిమ్ జీన్స్ వేసుకొని ఆ నడుము అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది. ప్రస్తుతం పూజా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్లామర్ క్వీన్, స్టన్నింగ్ బ్యూటీ, ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా తమిళ్ లో విజయ్ సరసన జన నాయగన్ లో నటించింది. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Updated Date - May 09 , 2026 | 07:32 PM